సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) గారాల పట్టి సితార (Sitara Ghattamaneni) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చిన్నవయసులోనే సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చి ఎంతో మంది ఫాలోవర్లను సొంతం చేసుకుంది. నిత్యం నెట్టింట్లో యాక్టివ్‌గా ఉంటూ ఫ్యామిలీ విషయాలతోపాటు.. చిన్న పిల్లలకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ షేర్ చేస్తుంటుంది. ఇక మహేష్ బాబుతో.. సోదరుడు గౌతమ్‌తో కలిసి సితార చేసే అల్లరి మాములుగా ఉండదు. అయితే గత కొద్ది రోజులుగా సితార డ్యాన్స్ నేర్చుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోస్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తుంటుంది. ఇక ఇటీవల మహేష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న సర్కారు వారి పాట సినిమాలోని పెన్నీ సాంగ్‌లో తళుక్కున మెరిసింది సీతూ పాప. సితార రాకింగ్ స్టెప్పులకు మహేష్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా… సినీ ప్రియులందరూ ముగ్దులయ్యారు. మొట్టమొదటి సారి సితార తెరపై కనిపించడంతో మహేష్ ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. మరోవైపు సితార డ్యాన్స్‌కు మహేష్, నమ్రత సైతం సంతోషం వ్యక్తం చేశారు. తాజాగా మహేష్ బాబు పుత్రికోత్సాహంలో ఉన్నారు.
శ్రీరామనవమి సందర్భంగా.. సితార మొట్ట మొదటిసారి కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించింది. సితారా కూచిపూడి నాట్యం వీడియోను తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేస్తూ తనను మరింత గర్వపడేలా చేసిందంటూ మహేష్ సంతోషం వ్యక్తం చేశారు. “సితారా మొట్ట మొదటి కూచిపూటి నృత్యాన్ని ప్రదర్శించింది. శ్రీరామనవమి రోజున తాను నృత్యం చేసినందుకు సంతోషంగా ఉంది. ఈ శ్లోకం శ్రీరాముని గొప్పతనాన్ని తెలియజేస్తుంది.. నా సీతూ పాప అంకితాభావానికి.. మీలోని కళ ఆశ్చర్యాన్ని కలిగించింది. మీరు నన్ను మరింత గర్వించేలా చేసారు. నా చిన్నారి సితార పట్ల అపారమైన గౌరవం, ప్రేమ ఉండాలి. ఈ అందమైన నృత్య ప్రదర్శన చేసేందుకు ఆమెకు గురువులుగా ఉన్న @arunabhikshu గారు. @mahathibhiksh గారికి ధన్యవాదాలు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ” అంటూ మహేష్ బాబు రాసుకొచ్చారు. ఇక సితారా డ్యాన్స్ చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.
Also Read: NTR Jr.-Koratala Shiva: తారక్ సినిమాపై క్రేజీ అప్డేట్.. కొరటాల.. ఎన్టీఆర్ మూవీ డేట్ ఫిక్స్ ?..
Viral Photo: ప్రకృతి అందాల నడుమ అందాల రాశి.. ఈ క్రేజీ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి..
Pakka Commercial: ఓటీటీలోకి గోపీచంద్ సినిమా.. పక్కా కమర్షియల్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే..
Malaika Arora: యక్సిడెంట్ తర్వాత తొలిసారి నోరు విప్పిన హీరోయిన్.. ఇప్పటికీ నమ్మశక్యంగా లేదంటూ..