మహేష్ బాబు అభిమానులు ఆల్రెడీ ఫ్రస్టేషన్‌లో ఉన్నారు. గుంటూరు కారం గురించి అప్‌డేట్స్ లేక.. షూటింగ్ జరుగుతుందో లేదో తెలియక వాళ్లంతా కన్ఫ్యూజన్‌లో ఉన్నారు. ఇలాంటి సమయంలో సూపర్ స్టార్ బర్త్ డేనే వాళ్లకు కాసింత సంతోషాన్ని కలిగించే వార్త. మరి అప్పుడైనా మహేష్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యే అప్‌డేట్స్ రానున్నాయా..? అసలు ఈ సారి సూపర్ స్టార్ బర్త్ డేకు రాబోయే స్పెషల్స్ ఏంటి..? కాగా మహేష్ నుంచి మైండ్ బ్లాక్ అయ్యే అప్‌డేట్స్ వచ్చి చాలా కాలమే అవుతుంది. గుంటూరు కారం షూటింగ్ అయినా సాఫీగా సాగుతుందా అంటే పడుతూ లేస్తూ.. అలా ముందుకు వెళ్తుంది. ఎలాగోలా కచ్చితంగా సంక్రాంతికి వచ్చేస్తామని దర్శక నిర్మాతలు చెప్తున్నారు కానీ అప్‌డేట్స్ విషయంలోనే అసంతృప్తిగా ఉన్నారు ఫ్యాన్స్. అభిమానుల డిమాండ్స్ దృష్టిలో పెట్టుకుని మహేష్ బాబు బర్త్ డే చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఆ రోజు రెండు సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ ఇవ్వాలని చూస్తున్నారు. ముఖ్యంగా గుంటూరు కారం నుంచి ఓ పాట విడుదల చేయాలనేది దర్శక నిర్మాతల ఆలోచన. మహేష్ బాబు ఫారెన్ నుంచి వచ్చేసరికి ఈ ట్యూన్ ఆడియన్స్‌లోకి వెళ్లాలని ఫిక్సైపోయారు థమన్.
అలాగే రాజమౌళి సినిమా గురించి కూడా ఏదైనా అప్‌డేట్ వస్తుందేమో అనే ఆశలో ఉన్నారు అభిమానులు. కనీసం ఓ పూజా కార్యక్రమం లాంటిదైనా చేస్తారేమో అని.. అదీ కాదంటే అధికారికంగా ఓ మాటేదైనా చెప్తారేమో అని చూస్తున్నారు. ఇక ఈ సారి బర్త్ డేకు బిజినెస్ మ్యాన్ 4కే వర్షన్ రీ రిలీజ్‌కు రెడీ అవుతుంది. గతేడాది బర్త్ డేకు పోకిరి సినిమాతో రీ రిలీజ్ ట్రెండ్ మొదలు పెట్టారు మహేష్. ఇదే హీరోలంతా ఫాలో అయ్యారు. ఈ సారి పుట్టిన రోజుకు బిజినెస్ మ్యాన్‌ను తీసుకొస్తున్నారు. మొత్తానికి గుంటూరు కారం సాంగ్.. రాజమౌళి అప్‌డేట్.. బిజినెస్ మ్యాన్ రీ రిలీజ్‌తో మహేష్ బర్త్ ప్లానింగ్స్ జరుగుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..