ముఫాసా: ది లయన్ కింగ్.. ఈ హాలీవుడ్ సినిమా కోసం దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం తెలుగు రాష్ట్రాల జనాలు సైతం వేయి కళ్లతో ఎదురుచూశారు. ఎట్టకేలకు ఈరోజు (డిసెంబర్ 20న) ఈ మూవీ అడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమాకు సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఇవ్వడంతో ఓ రేంజ్ క్రేజ్ నెలకొంది. ది లయన్ కింగ్ సినిమాలో నాని, జగపతి బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇక ముఫాసాకు మహేష్ బాబు వాయిస్ ఇవ్వడంతో తెలుగు నాట భారీ ఎత్తున క్రేజ్ సంపాదించుకుంది ఈ చిత్రం. అలాగే మహేష్ ఫ్యాన్స్ గురించి చెప్పక్కర్లేదు. ముసాఫా విడుదలకు ముందు రోజు నుంచే థియేటర్లలో హంగామా స్టార్ట్ చేశారు.
ఈరోజు ముఫాసా థియేటర్ల వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు మహేష్ ఫ్యాన్స్. గుంటూరు కారం సినిమా తర్వాత చాలా రోజులకు మళ్లీ తమ అభిమాన హీరో వాయిస్ తో సినిమా రావడంతో థియేటర్లకు క్యూ కట్టాయి. మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చిన ఈ సినిమాను ఫ్యాన్స్ గ్రాండ్ గా సెలబ్రెట్ చేసుకుంటున్నారు. ముఫాసా సింహాల కథ.. కాబట్టి.. సింహాలను ఎలాగూ తీసుకువచ్చి ఎత్తుకోలేరు. దీంతో పిల్లిని పులిలా భావించి థియేటర్ కు తీసుకువచ్చారు. అంతేకాదు.. సినిమాలోని ఐకానిక్ షాట్ ను ఈ పిల్లితో రీక్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ డైరెక్టర్ రాజమౌళి సినిమా కోసం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. అసలు ఇంతవరకు ఒక్క అప్డేట్ కూడా రాకపోవడంతో ఫ్యాన్స్ అసహనంగా ఉన్నారు. ఈ క్రమంలో మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చిన ముఫాసా సినిమా విడుదల కావడాన్ని తెగ సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్.
Creativity lo Telugu Audience>>>>>>🔥🔥🔥🔥
Ela vastai ra e idea lu🥵#MaheshBabu #Mufasa pic.twitter.com/BAjIjnLvpI— Prabhas Devotee🔥 (@SainathPB) December 20, 2024
Prathi pilli ki oka roju ostadi 💯 pic.twitter.com/wmC3ZZN33i
— Deepu 🌍 (@KuthaRamp) December 20, 2024
ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‌బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..
Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‌గా..
Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..
Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‌ను మించిన అందం.. ఎవరంటే..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.