Mahesh Babu: మహేష్ సినిమా పై వస్తోన్న రూమర్స్‌కుచెక్ పెట్టిన ప్రొడ్యూసర్స్.. అవేంటంటే

|

Sep 22, 2022 | 7:28 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ SSMB28. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది.

Mahesh Babu: మహేష్ సినిమా పై వస్తోన్న రూమర్స్‌కుచెక్ పెట్టిన ప్రొడ్యూసర్స్.. అవేంటంటే
Mahesh Babu
Follow us on

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ SSMB28. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. దాదాపు 11 ఏళ్ల తర్వాత త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అతడు. ఖలేజా సినిమాలు ఎలాంటి విజయాలను అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు త్రివిక్రమ్ అండ్ మహేష్. ఇటీవలే షూటింగ్ మొదలు పెట్టిన చిత్రయూనిట్ మొదటి షడ్యూల్ ను కూడా పూర్తి చేసుకుంది. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ ను మొదలు పెట్టనున్నారు. ఇదిలా ఉంటే..

అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో జరిగిన ఫస్ట్ షెడ్యూల్ లో మహేష్ బాబు పాల్గొన్నారు. హైఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లో మహేష్ ఇరగదీశారని అంటున్నారు. అయితే ఈ ఫైట్ సీన్స్ పై గతకొద్దిరోజులుగా ఓ పుకారు షికారు చేసస్తోంది. . ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్స్ అన్బరివ్ డిజన్ చేసిన ఈ ఫైట్ పై మహేష్ అంత సంతృప్తిగా లేరని ఫైట్ మాస్టర్ ను మార్చాలని అనుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తలకు చెప్ పెడుతూ.. మొదటి షెడ్యూల్ కంప్లీట్ అయ్యిందని  నిర్మాతలు ప్రకటించారు. “కొన్ని కిక్కాస్ హై ఆక్టేన్ ఎపిక్ యాక్షన్ సీన్స్ షూటింగ్ తోSSMB28 మొదటి షెడ్యూల్ పూర్తయింది. అమేజింగ్ స్టంట్ కొరియోగ్రఫీకి అన్బరివ్ మాస్టర్స్ కి థ్యాంక్స్. దసరా తర్వాత ప్రారంభం కానున్న రెండవ షెడ్యూల్ లో మన సూపర్ స్టార్ మహేష్, బుట్ట బొమ్మ పూజా హెగ్డే పాల్గొంటారు. త్వరలో మరిన్ని అప్డేట్స్ వస్తాయి” అంటూ నిర్మాతలు ట్వీట్ చేశారు. దాంతో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..