
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కరల గారాల పట్టి సితార ఘట్టమనేని తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తోంది. ఇప్పటికే హీరోయిన్లకు మించిన పాపులారిటీ తెచ్చుకుందీ స్టార్ కిడ్. ఇప్పటికే తన యూట్యూబ్ ఛానెల్‌తో మంచి డ్యాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకుంది సితార. అలాగే సర్కారు వారి పాట సినిమాలో మహేష్‌తో కలిసి స్టెప్పులేసింది కూడా. ఇక ఫ్రోజెన్ 2 మూవీ తెలుగు వెర్షన్‌లో బేబీ ఎల్సా పాత్రకు వాయిస్ ఓవర్ ఇచ్చి ఆకట్టుకుంది. ఇలా మల్టీ ట్యాలెంటెడ్ గర్ల్‌గా దూసుకుపోతోన్న సితార ఇటీవల పీఎంజే అనే జ్యువెలరీ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించింది. సితార నటించిన ఈ జ్యువెలరీ యాడ్‌కు సంబంధించిన ఫొటోలను ఏకంగా న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్‌బోర్డ్ ప్రదర్శించారు. ఇక ఈ ప్రకటనలో నటించేందుకు గానూ సితార కోటి రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుందని తెలుస్తుంది. అయితే ఈ పారితోషకాన్ని సేవా స్వచ్ఛంద కార్యక్రమాలకు ఇచ్చేసినట్లు తెలిపింది మహేష్ గారాల పట్టి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సితార తన ఫస్ట్ రెమ్యునరేషన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు ఇచ్చిన రెమ్యునరేషన్‌ను ఛారిటీకి ఇచ్చేసానంది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. మహేశ్ అడుగుజాడల్లోనే సితార కూడా నడుస్తోందంటూ అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా మహేశ్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంతో మంది చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఫౌండేషన్ బాధ్యతలను నమ్రతా దగ్గరుండి మరీ చూసుకుంటోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.