Tollywood : మరికాసేపట్లో ఏపీకి సినీపెద్దలు.. ఎవరెవరు వెళ్తున్నారంటే..

టాలీవుడ్ సమస్యలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిసేందుకు మరి కాసేపట్లో తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ కు  బయలుదేరనున్నారు సినీ పెద్దలు..

Tollywood : మరికాసేపట్లో ఏపీకి సినీపెద్దలు.. ఎవరెవరు వెళ్తున్నారంటే..
Jagan
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 10, 2022 | 7:44 AM

Tollywood : టాలీవుడ్ సమస్యలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిసేందుకు మరి కాసేపట్లో తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ కు  బయలుదేరనున్నారు సినీ పెద్దలు.. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు బయల్దేరనుంది టాలీవుడ్‌ బృందం. ఉదయం 11 గంటల సమయంలో సీఎంతో భేటీ కానున్నారు.. ఈ సమావేశంలో సినిమా టిక్కెట్ ధర, స్పెషల్ షో లపై చర్చించే అవకాశమున్నట్లు టాక్ వినిపిస్తోంది. సామాన్యులకు సినిమా టికెట్ ధర అందుబాటులోకి అంటూ.. థియేటర్ లో టికెట్ ధరలు తగ్గించడంతో పాటు, బెనిఫిట్ షోలకు అనుమతిని నిరాకరిస్తూ ఏపీ ప్ర‌భుత్వం జీవో విడుద‌ల చేయ‌డంతో స‌మ‌స్య మొద‌లైంది. మంత్రి పేర్ని నానిని ఎక్కువమంది కి అపాయింట్మెంట్ ఇవ్వాలని సినీ పెద్దలు కోరారు. అయితే కోవిడ్ కారణంగా తక్కువమంది రావాలని మంత్రి పేర్ని నాని సూచించారట.

దాంతో చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, అలీ, రాజమౌళి, కొరటాల శివ,నిరంజన్ రెడ్డి తోపాటు పలువురు సీఎంను కలవనున్నారని తెలుస్తుంది. ఈ భేటీలో ఏపీ ప్రభుత్వం ముందు పలు విన్నపాలు పెట్టనున్నారు సినీ ప్రముఖులు. ముఖ్యంగా సినిమా టికెట్ల రేట్లు, ఏపీలో పరిశ్రమ అభివృద్ధిపై చర్చించనున్నారు. పరిశ్రమకు సంబంధించి 17 అంశాలను సీఎం ముందు పెట్టనున్నట్లు సమాచారం. త్వరలో తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి కొన్ని విభాగాలు ఏపీలో పెట్టడం పై కూడా చర్చించనున్నారు సినీ పెద్దలు. అంతేకాదు ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న నంది పురస్కారాలపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవాకాశం ఉందని తెలుస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Priyamani: కొంటె చూపులతో కవ్విస్తున్న కాటుకళ్ల చిన్నది.. ప్రియమణి లేటెస్ట్ ఇమేజెస్

Ashu Reddy: మైండ్ బ్లాక్ అందాలతో మాయ చేస్తున్న అషు లేటెస్ట్ పిక్స్

Alia Bhatt: అందాల ఆలియా పరువాలు చూడతరమా.. లేటెస్ట్ ఫోటోస్ వైరల్