
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా.. యంగ్ హీరోయిన్ శ్రీలీల కీలకపాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇటీవల విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ ఒక్కసారిగా అంచనాలను మార్చేసింది. చాలా రోజులుగా ఈ సినిమా అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న అభిమానులకు ఫుల్ మీల్స్ అందించారు మేకర్స్. ఇదిలా ఉంటే.. ఈ సినిమా తర్వాత మహేష్.. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో సంచలనం సృష్టించిన జక్కన్న తన నెక్ట్స్ మూవీ మహేష్ బాబుతో ఉండబోతుందని చెప్పడంతో ఈ కాంబోలో అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇక ముఖ్యంగా ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉండనుందని తెలియడంతో ఒక్కసారిగా హైప్ పెరిగిపోయింది. ఇక ఈ మూవీకి సంబంధించి రోజుకో వార్త నెట్టింట వైరలవుతుంది.
ఇక ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో మరో ఆసక్తికర విషయం చక్కర్లు కొడుతుంది. అదెంటంటే.. ఈ సినిమాను మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 9న అధికారికంగా లాంచ్ చేసి.. వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారని తెలుస్తోంది. మరీ ఈ వార్తలలో నిజమెంత వరకు ఉందనేది తెలియాల్సి ఉంది. ఆస్ట్రేలియా అడువుల నేపథ్యంలో రానున్న ఈ సినిమాలో అమీర్ ఖాన్ ను ప్రతినాయకుడిగా తీసుకోనున్నట్లుగా రూమర్స్ వైరలయ్యాయి. అయితే అమిర్ ఖాన్ విలన్ పాత్రలో కాదని టాక్. ప్రస్తుతం ఈ మూవీ ఇంకా స్క్రిప్ట్ వర్క్ దశలోనే ఉంది. స్క్రిప్ట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాతే చిత్రయూనిట్.. ఆయా పాత్రకు నటీనటులను ఎంపిక చేయబోతుంది.
ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్ చేయబోయే సినిమా ఫోకస్ పెట్టారు జక్కన్న. వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా భారీగా నిర్మించున్నారని తెలుస్తోంది. ఇక ఇటీవల మహేష్.. స్టైలీష్ అండ్ కూల్ లుక్కులో కనిపించారు. దీంతో జక్కన్న సినిమా కోసం మహేష్ పూర్తిగా హాలీవుడ్ హీరో లుక్కులోకి వచ్చేశాడని అంటున్నారు ఫ్యాన్స్. మొత్తానికి జక్కన్న, మహేష్ సినిమాపై త్వరలోనే అనౌన్మెంట్ రానున్నట్లు తెలుస్తోంది.