టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు గారాల పట్టి సితార ఘట్టమనేని పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు,నెటిజన్లు మహేశ్ వారసురాలికి బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇక హీరో మహేశ్ బాబు తన దైన స్టై ల్ లో తన కూతురికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. సన్ సైన్‌లో మెరిసిపోతున్న సితార ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర చేసిన మహేశ్ ‘ ‘హ్యాపీ 12 మై సన్‌షైన్’ అని విషెస్ చెప్పాడు. ఇక నమ్రతా కూడా స్పెషల్ వీడియతో సితారకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. తన కూతురి చిన్నప్పటి ఫొటోలు, వీడియోలతో దీనిని క్రియేట్ చేసిందామె.. ‘నా చిట్టి ప్రయాణ సహచరురాలికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. వివిధ దేశాలు, లెక్కలేనన్ని జ్ఞాపకాలు.. నువ్వు ఎల్లప్పుడూ నాకొక ట్రావెల్ గైడ్‌లా ఉంటూ నీతో ఉన్న ప్రతి క్షణాన్ని ప్రత్యేకం చేశావు. ఈ క్షణాలు, జ్ఞాపకాలను సెలబ్రేట్ చేసుకుంటున్నా. ఐ లవ్ యూ మై స్వీట్‌హార్ట్’ అని క్యాప్షన్ జత చేసింది నమ్రత. ప్రస్తుతం మహేశ్, నమ్రతల పోస్టులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వీటిపై పలువురు సినీ ప్రముఖులు, అభినందనలు, నెటజన్లు స్పందిస్తున్నారు. సితారకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.
కాగా మహేష్ , నమ్రతల దంపతులకు ఎంత ఫాలోయింగ్ ఉందో.. ప్రస్తుతం వారి పిల్లలకు కూడా అదే క్రేజ్ ఉంది. ముఖ్యంగా సితార ఘట్టమనేని సినిమాల్లోకి రాకముందే బాగా ఫేమస్ అయిపోయింది. తల్లిదండ్రుల బాటలోనే నడుస్తోన్న ఈ స్టార్ కిడ్ తరచూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటోంది. అలాగే ఆ మధ్యన ఓ నగల దుకాణానికి బ్రాండ్ అబాసిండర్ గా వ్యవహరించింది. ఇందుకు వచ్చిన పారితోషకాన్ని సైతం సేవా కార్యక్రమాల కోసం వెచ్చింది తన గొప్ప మనసును చాటుకుంది.
Happy 12 my sunshine! ☀️♥️ pic.twitter.com/ADoDhBBVH7
— Mahesh Babu (@urstrulyMahesh) July 20, 2024
కాగా ప్రస్తుతం డ్యాన్స్, యాక్టింగ్ లో శిక్షణ తీసుకుంటోంది సితార. ఇప్పటికే మహేశ్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమాలోని ఓ పాటలో తళుక్కున మెరిసింది మహేశ్ గారాల పట్టి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.