Mahesh Babu: దుబాయ్‏లో మహేష్ బాబు ఫ్యామిలీ న్యూఇయర్ సెలబ్రెషన్స్.. నెట్టింట్లో ఫోటోస్ వైరల్..

|

Jan 01, 2022 | 10:08 AM

సాధారణంగా సెలబ్రెటీలు కాస్త సమయం దొరికితే చాలు ఫ్యామిలీతో గడపడానికి ఇష్టపడుతుంటారు. సినిమా షెడ్యూల్ నుంచి బ్రేక్

Mahesh Babu: దుబాయ్‏లో మహేష్ బాబు ఫ్యామిలీ న్యూఇయర్ సెలబ్రెషన్స్.. నెట్టింట్లో ఫోటోస్ వైరల్..
Mahesh
Follow us on

సాధారణంగా సెలబ్రెటీలు కాస్త సమయం దొరికితే చాలు ఫ్యామిలీతో గడపడానికి ఇష్టపడుతుంటారు. సినిమా షెడ్యూల్ నుంచి బ్రేక్ దొరికితే కుటుంబంతో సహా విదేశాల్లో వాలిపోతుంటారు. ఇక స్పెషల్ డేస్ సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అలా అన్ని భాషల నటీనటులు కుటుంబం కోసం కేటాయించేస్తుంటారు. ఇక వీరు విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా నుంచి కాస్త్ బ్రేక్ దొరికిన కుటుంంతో కలిసి ఎంజాయ్ చేస్తుంటారు. కూతురు సితారా, కుమారుడు గౌతమ్‏తో కలిసి ఉండటానికి ఎక్కువగా సమయం వెచ్చిస్తారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ ఇప్పటికే నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ వేడుకలను దుబాయ్‏లో సెలబ్రేట్ చేసుకున్నారు. వీరితోపాటు.. డైరెక్టర్ వంశీ పైడిపల్లి కుటుంబం కూడా ఇటీవల క్రిస్మస్ సెలబ్రెషన్స్ దుబాయ్‏లో జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. నిన్న రాత్రి ఓ రెస్టారెంట్‏లో మహేష్ ఫ్యామిలీ న్యూఇయర్ సెలబ్రెషన్స్ జరుపుకున్నారు. తన కుటుంబంతో కలిసి డిన్నర్ చేస్తున్న ఫోటోను మహేష్ సతీమణి నమ్రత తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసింది. అలాగే బుర్జ్ ఖలీఫా పై తన కుటుంబంతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ న్యూఇయర్ విషెస్ తెలిపాడు మహేష్. ప్రస్తుతం మహేష్ బాబు.. డైరెక్టర్ పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‏గా నటిస్తోంది.

Also Read: Deepthi Sunaina-Shanmukh: షణ్ముఖ్‏తో బ్రేకప్.. భావోద్వేగ పోస్ట్ షేర్ చేసిన దీప్తి సునయన..

Viral Photo: బ్యాట్ పట్టుకున్న ఈ చిన్నది ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా!

Telangana – Theater: ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ప్రెసిడెంట్ ప్రకటన..

Hero Nani: నిర్మాత కోసం నేచురల్ నాని డేరింగ్ స్టెప్.. రెమ్యునరేషన్‌ని వెనక్కి ఇచ్చేశాడంటూ టాక్..