
అల వైకుంఠపురంలో తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తోన్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. అతడు, ఖలేజా వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఇక ఈమూవీలోని సాంగ్స్ గురించి చెప్పక్కర్లేదు. ఇదివరకే విడుదలైన మూడు పాటలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ధమ్ మసాల, ఓ మై బేబీ, కుర్చీ మడతబెట్టి పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో చిత్రయూనిట్ గుంటూరు కారం ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది.
ఇందులో భాగంగా ఈరోజు (జనవరి 6న) గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ లాంచ్ జరగాల్సి ఉంది. కానీ అనుహ్య కారణాలతో ఈవెంట్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్. దీంతో ఈ మూవీ ట్రైలర్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. ఇదిలా ఉంటే.. రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర ప్రాంతాల్లో గుంటూరు కారం సందడి మొదలైంది. థియేటర్స్ వద్ద ఘట్టమనేని ఫ్యాన్స్ హంగామా స్టార్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద పోస్టర్స్, భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి గుమ్మడికాయలతో దిష్టి తీస్తున్నారు.
Kakinada Big day 1 release on cards🤘@urstrulyMahesh #GunturKaarampic.twitter.com/IYXvAFfP90
— Maharashtra MBFC (@MHMaheshFC) January 5, 2024
Just sample mathrame😉🔥
Jan 12th vacheyandi kaludham🌶️🔥#GunturKaaram @urstrulyMahesh pic.twitter.com/Hbog6gM9xe— Charan🌶️ (@CharanMb02) January 5, 2024
తాజాగా రాజమండ్రి అప్సర థియేటర్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుతోపాటు.. డైరెక్టర్ త్రివిక్రమ్ ల ప్రత్యేక కటౌట్స్ ఏర్పాటు చేసారు. అలాగే కాకినాడలో ఓ వీధి మొత్తం మహేష్ బాబు పోస్టర్స్ ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. వీధి వీధంతా మహేష్ పోస్టర్లతో నిండిపోవడంతో గుంటూరు కారం మాస్ జాతర అప్పుడే మొదలైనట్లుగా తెలుస్తోంది. అలాగే హైదరాబాద్లోని ఆర్సీ పురం ఎస్వీసీ సంగీత థియేటర్లో మహేష్ బాబు భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. తెలంగాణలో మొదటి గుంటూరు కారం కటౌట్ అంటున్నారు నెటిజన్స్. ఇందుకు సంబంధించిన పోస్టర్స్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవున్నాయి. మొత్తానికి విడుదలకు వారం రోజుల ముందే తెలుగు రాష్ట్రాల్లో రమణగాడి మాస్ జాతర షూరు అయ్యింది.
Finally I Did It🤙🔥
As of now first cutout for #GunturKaaram in Telangana 🫰SVC Sangeetha RC Puram (Patancheru) Hyd 🔥🔥🔥 @urstrulyMahesh ❤️#GunturKaaramPremiersOnJan11 #GunturKaaramTrailer pic.twitter.com/nGUtU4rJub
— Harish Nalladi (@HarishNalladi) January 6, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.