Maha Kumbh Mela: సన్యాసం స్వీకరించిన హీరోయిన్‌కు బిగ్ షాక్.. కిన్నార్ అఖాడా నుంచి బహిష్కరణ.. కారణమిదే
మమతా కులకర్ణి 1990లలో 'కరణ్ అర్జున్', 'బాజీ' వంటి హిట్ సినిమాల్లో నటించింది. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో రొమాన్స్ చేసింది. ఇక తెలుగులోనూ ప్రేమ శిఖరం, దొంగ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ మేళాలో ఇటీవల ప్రముఖ నటి మమతా కులకర్ణి సన్యాసం తీసుకున్నారు. అంతేకాదు ఆమెను కిన్నార్ అఖాడా మహామండలేశ్వరీ పదవిని కూడా ఇచ్చారు. దీనిని చాలా మంది తీవ్రంగా వ్యతిరేకించారు. మమతను మహామండలేశ్వరీగా నియమించిన చేసిన తర్వాత కిన్నార్ అఖారాలో పెద్ద పోరాటమే మొదలైంది. దీంతో ఇప్పుడు మహామండలేశ్వరి పదవి నుంచి మమతను తప్పించారు. అలాగే ఆచార్య మహామండలేశ్వర్ అయిన లక్ష్మీ నారాయణ్ త్రిపాఠి పై కూడా వేటు పడింది. వారిద్దరినీ కిన్నార్ అఖాడా నుంచి తొలగించారు. ఈ మేరకు కిన్నార్ అఖాడా వ్యవస్థాపకులు రిషి అజయ్ దాస్ ఆదేశాలు జారీ చేశారు. లక్ష్మీ నారాయణ్ త్రిపాఠి, మమతా కులకర్ణిని తొలగించిన తర్వాత ఇప్పుడు కిన్నార్ అఖాడా పునర్నిర్మాణం జరుగుతుందని, త్వరలోనే కొత్త ఆచార్య మహామండలేశ్వరుడిని నియమిస్తామని అజయ్ దాస్ ప్రకటించారు.
దాదాపు 25 ఏళ్ల తర్వాత మమతా కులకర్ణి భారత్‌కు తిరిగి వచ్చారు. భారతదేశానికి వచ్చిన తర్వాత, ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ్ సందర్భంగా ఆమె సన్యాసం స్వీకరించింది. ఆ తర్వాత జరిగిన పట్టాభిషేక కార్యక్రమంలో ఆమెను కిన్నార్ అఖాడా మహామండలేశ్వరీగా నియమించారు. దీని తర్వాత మమతకు శ్రీ యమై మమతా నందగిరి అని నామకరణం కూడా చేశారు. అయితే, ఈ సంఘటనలన్నింటి గురించి ఇతర సాధువులు ప్రశ్నలు లేవనెత్తారు. డ్రగ్స్ ఆరోపణల్లో చిక్కుకున్న నటిని మహా మండలేశ్వరిగా ఎలా నియమిస్తారంటూ ప్రశ్నించారు. వివాదం తీవ్రమవుతుండడంతో మమతపై బహిష్కరణ వేటు తప్పలేదు.
‘ కిన్నార్ కమ్యూనిటీ పురోగతి కోసం, మతపరమైన ఆచారాలను లక్ష్యంతోనే లక్ష్మీ నారాయణ్ త్రిపాఠి కి బాధ్యతలు అప్పగించారు. కానీ ఆయన కిన్నార్ అఖాడాను పూర్తిగా తప్పుదారి పట్టించాడు. నా అనుమతి లేకుండా 2019 ప్రయాగ్‌రాజ్ కుంభ్‌లో జునా అఖారాతో వ్రాతపూర్వక ఒప్పందం చేసుకున్నారు. ఇది అనైతికం మాత్రమే కాదు, ఒక రకమైన మోసం. లక్ష్మీ నారాయణ్ త్రిపాఠి, సనాతన ధర్మం, దేశ ప్రయోజనాలను పక్కనబెట్టి, సినిమా ఇండస్ట్రీకి చెందిన, డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న మమతా కులకర్ణికి పట్టం కట్టారు’ అని అజయ్ దాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Rishi Ajay Das, founder of Kinnar Akhara, expels Mamta Kulkarni from the Akhara. He has also expelled Mahamandaleshwar Laxminarayan Tripathi from the Kinnar Akhara for inducting Mamta Kulkarni, who is accused of treason, to the Akhara and designating her as Mahamandaleshwar… pic.twitter.com/Hhzezst49r
— ANI (@ANI) January 31, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి