2009లో విడుదలైన ‘మగధీర’ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఆ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మెరిసిపోతే, ప్రముఖ నటుడు దేవ్ గిల్ విలన్ పాత్రలో క్రూరత్వం పండించి అందరి దృష్టిని ఆకర్షించాడు . విలన్‌గా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడీ స్టైలిష్ విలన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. కథా నాయకుడిగా సినిమా ఇండస్ట్రీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. దేవ గిల్ హీరోగా నటించిన సినిమా ‘అహో విక్రమార్క’. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ విడుదల కానుంది. దీంతో ‘అహో విక్రమార్క’ సినిమా ప్రమోషన్స్ భారీగా జరుగుతున్నాయి. ఈ సినిమా ఆగస్ట్ 30న విడుదల కానుంది. ఈ సినిమా కన్నడలో కూడా విడుదల కానుంది. తాజాగా దేవ్ గిల్ ప్రమోషన్ కోసం చిత్ర బృందంతో కలిసి బెంగళూరు వచ్చాడు. ‘అహో విక్రమార్క’ చిత్రంలోని ‘మీనాక్షి..’ అనే పాటను సంగీత దర్శకుడు రవి బస్రూరు ఇటీవల బెంగళూరులోని ఊర్వశి సినిమాలో విడుదల చేశారు. ‘దేవ్ గిల్‌ని తెరపై చూడగానే నాకు భయం వేసేది. కానీ అతను మా ఇంటికి వచ్చినప్పుడు అతని సింప్లిసిటీ, వినయం నాకు నచ్చింది. ఆయనకు సినిమా అంటే చాలా ఇష్టం. ‘అహో విక్రమార్క’ సినిమా సినీరంగంలో డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుంది’ అని రవి బస్రూరు చెప్పుకొచ్చారు
దర్శకుడు త్రికోటి ‘అహో విక్రమార్క’ ను తెరకెక్కించారు. తేజస్విని పండిట్, ప్రవీణ్ తర్దే, పోసాని మురళీకృష్ణ, సాయాజీ షిండే, విక్రమ్ శర్మ, కాలకేయ ప్రభాకర్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆర్తి దేవిందర్ గిల్, అశ్విని కుమార్ మిశ్రా, మిహిర్ కులకర్ణి ఈ చిత్రాన్ని నిర్మించారు.దేవ్ గిల్ సినిమాపై ఆశలు పెట్టుకున్నాడు. ఇందులో భాగంగానే అన్ని ఇండస్ట్రీలకు సంబంధించిన సినీ ప్రముఖుల నుంచి మద్దతు కోరారు. తాజాగా విడుదలైన కొత్త పాటలో దేవ్ గిల్, నటి చిత్రా శుక్లా బిందాస్‌గా డ్యాన్స్ చేశారు. ఈ పాటకు రవి బస్రూరు సంగీత దర్శకత్వం వహించారు.
With every beat, his love for #Archana roars louder 🕺❤️
New song from #AhoVikramaarka in Kannada OUT NOW on #PanoramaMusicSouth YouTube Channel
Link – https://t.co/zDikFAmsbu
Film set to release on August 30th ❤️🔥
@iamdevsinghgill @ChitraShuklaOff @WriterPravin @tejaswwini pic.twitter.com/KHDBXOMPQx— DevGillProductions (@DGillProduction) August 6, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.