AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush: ఆదిపురుష్ పై అభ్యంతరం.. దర్శకుడికి వార్నింగ్ ఇచ్చిన ఆ రాష్ట్ర హోమ్ మంత్రి

రామాయణ ఇతిహాస నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సీతగా బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ నటిస్తోంది. అలాగే రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించనున్నారు.

Adipurush: ఆదిపురుష్ పై అభ్యంతరం.. దర్శకుడికి వార్నింగ్ ఇచ్చిన ఆ రాష్ట్ర హోమ్ మంత్రి
Narottam Mishra , Adipurus
Rajeev Rayala
|

Updated on: Oct 04, 2022 | 4:48 PM

Share

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నారు. రామాయణ ఇతిహాస నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సీతగా బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ నటిస్తోంది. అలాగే రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. గత రికార్డులను ఆదిపురుష్ టీజర్ తిరగ రాస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా పై పలు రకాల వివాదాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ టీజర్ పై ప్రభాస్ నిరాశతో ఉన్నారు. ఈ టీజర్ లో ప్రభాస్‌ను గ్రాఫిక్స్ తో కవర్ చేశారని అంటున్నారు. కొంతమంది చిన్న పిల్లల ఏనిమేషన్ మూవీలా టీజర్ ఉందంటూ ట్రోల్ చేస్తున్నారు. ప్రభాస్ ను అనుకున్న రేంజ్ లో ప్రజెంట్ చేయలేదంటూ ఫ్యాన్ మండిపడుతున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఆదిపురుష్ టీజర్ పై మధ్యప్రదేశ్ హోమ్ మంత్రి నరోత్తమ్ మిశ్ర మండిపడ్డారు. ఈ టీజర్ లో హిందూ దేవతలను తప్పుగా చూపించారని ఆయన ఆరోపించారు. ఆ సన్నివేశాలను తొలగించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు మధ్యప్రదేశ్ హోమ్ మంత్రి. హిందువుల మనోభావాలు దెబ్బతీయొద్దంటూ దర్శకుడు ఓం రౌత్ కు నరోత్తం మిశ్ర వార్నింగ్  ఇచ్చారు.

ఇటీవల విడుదలైన ట్రైలర్ లో హనుమంతుడు లెదర్ వేసుకున్నట్టు చూపించారు. అలాగే మిగిలిన దేవుళ్ల వస్త్రధారణ కూడా బిన్నంగా ఉంది. గ్రంధాల్లో పేర్కొన్నాడు బిన్నంగా తమ సినిమాలో దేవుళ్ళ వస్త్రధారణ ఉందని హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, దేవుళ్లను తప్పుగా చూపించిన సన్నివేశాలను తొలగించాలని దర్శకుడు ఓం రౌత్ కు లేఖ రాస్తామని నరోత్తమ్ మిశ్ర అన్నారు. ఈమేరకు ఆయన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ దర్శకుడు ఓం రౌత్ కు వార్నింగ్ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
Weekly Horoscope: ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం, ఉద్యోగ యోగం..
Weekly Horoscope: ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం, ఉద్యోగ యోగం..
వేపుళ్లకు వాడిన నూనెతో ఏం చేయొచ్చో తెలిస్తే ఇంకెప్పుడూ పారేయరు
వేపుళ్లకు వాడిన నూనెతో ఏం చేయొచ్చో తెలిస్తే ఇంకెప్పుడూ పారేయరు
తెలుగు రాష్ట్రాలను కలుపుతూ గ్రీన్‌ఫీల్డ్ హైవే.. వారంలో ప్రారంభం..
తెలుగు రాష్ట్రాలను కలుపుతూ గ్రీన్‌ఫీల్డ్ హైవే.. వారంలో ప్రారంభం..
శ్రీలంక టూర్‌లో హఠాత్తుగా మారిన షెడ్యూల్..బీసీసీఐ షాకింగ్ నిర్ణయం
శ్రీలంక టూర్‌లో హఠాత్తుగా మారిన షెడ్యూల్..బీసీసీఐ షాకింగ్ నిర్ణయం
కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం
కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం
సుద్ద నేలలో చురకైన పంట ఇది.. భలా రైతన్న...
సుద్ద నేలలో చురకైన పంట ఇది.. భలా రైతన్న...
అరటిపండు తొక్కలకు కొద్దిగా వెనిగర్ కలిపితే జరిగే మ్యాజిక్ ఇదే..
అరటిపండు తొక్కలకు కొద్దిగా వెనిగర్ కలిపితే జరిగే మ్యాజిక్ ఇదే..
దొరికితే వదలకండి : వంద రోగాలకు ఒకే మందు.. పాత కాలం వారి బలం
దొరికితే వదలకండి : వంద రోగాలకు ఒకే మందు.. పాత కాలం వారి బలం
భోజనం చేసిన పళ్లెంలోనే చేతులు కడుక్కుంటున్నారా? ఈ పొరపాటు..
భోజనం చేసిన పళ్లెంలోనే చేతులు కడుక్కుంటున్నారా? ఈ పొరపాటు..
గట్టిపడిన చికెన్, మటన్ పచ్చడి ముక్కల్ని దూదిలా మార్చే హ్యాక్స్!
గట్టిపడిన చికెన్, మటన్ పచ్చడి ముక్కల్ని దూదిలా మార్చే హ్యాక్స్!