Unstoppable Season 2: బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ 2 మొదటి గెస్ట్ ఆయనే.. లీకైన ఫోటో.. సోషల్ మీడియాలో వైరల్
మొదటి సారి హోస్ట్‌గా టాక్ షో నిర్వహిస్తున్న బాలయ్య. తనదైన మాటలతో, పంచ్ లతో గెస్ట్ లను ఆటపట్టిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తన షోకు వచ్చిన గెస్ట్ లకు సంబంధించిన సీక్రెట్స్ బయట పెడుతూ సందడి చేశారు బాలకృష్ణ.
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న అన్ స్టాపబుల్ గురించి ఇప్పుడు అందురూ మాట్లాడుకుంటున్నారు. సినిమాల్లో తన నటనతో, డైలాగ్స్ తో చెలరేగిపోయే బాలయ్య.. ఆహాలో టెలికాస్ట్ అవుతోన్న అన్ స్టాపబుల్ షో ద్వారా బాలకృష్ణ ప్రేక్షకులను అలరిస్తున్నారు. మొదటి సారి హోస్ట్‌గా టాక్ షో నిర్వహిస్తున్న బాలయ్య. తనదైన మాటలతో, పంచ్ లతో గెస్ట్ లను ఆటపట్టిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తన షోకు వచ్చిన గెస్ట్ లకు సంబంధించిన సీక్రెట్స్ బయట పెడుతూ సందడి చేశారు బాలకృష్ణ. ఇక అన్ స్టాపబుల్ మొదటి సీజన్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఇక ఇప్పుడు సీజన్ 2 కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎందురుచూస్తున్నారు. ఐఏండిబి లో టాక్ షో అన్నింటిలోనూ అన్ స్టాపబులే నెంబర్ వన్ ఉండేలా నిలబెట్టారు బాలకృష్ణ. ఇప్పుడు సీజన్ 2 తో రావడానికి రెడీ అయ్యారు బాలయ్య.
నిజానికి ఇప్పటికే అన్ స్టాపబుల్ సీజన్ 2 మొదలవ్వాల్సి ఉంది. అయితే బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కారణంగా అన్ స్టాపబుల్ సీజన్ 2 ఆలస్యం అయ్యింది. ఇక ఇప్పుడు గోపిచంద్ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో ఇప్పుడు అన్ స్టాపబుల్ సీజన్ 2ను మొదలు పెట్టారు. అయితే ఈ సీజన్ కు సంబంధించిన ట్రైలర్‌ను నేడు విజయవాడలో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.
ఇదిలా ఉంటే ఈ సీజన్ లో మొదటి గెస్ట్ గా తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయడు హాజరు కానున్నారు. బాలయ్య షోకు చంద్రబాబు హాజరైన ఫోటోలు లీక్ అవ్వడంతో అవి కాస్తా వైరల్ గా మారాయి. చంద్రబాబు బాలయ్య కు బావ అవుతారన్న విషయం తెలిసిందే. ఇక ఈ ఇద్దరి మధ్య ఎలాంటి సంభాషణలు జరుగుతాయని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..