తండ్రి పాత్రలో విజయ్.. ఏ సినిమా అంటే.?

25 December 2024

Battula Prudvi

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రాహుల్ సంక్రీత్యన్ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్ ఓ సినిమా నిర్మిస్తున్నారు.

త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ పూజ కార్యక్రమాలతో మొదలు కానుంది. 1850 టైమ్‌లో ఈ కథ నడుస్తుందని తెలిపారు మూవీ మేకర్స్.

బ్రిటీష్ కాలం నాటి పీరియాడిక్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో విజయ్ తండ్రీ కొడుకులుగా నటించబోతున్నారని తెలుస్తుంది.

దీనికి రణబలి అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. అయితే ఈ చిత్రం టైటిల్ పై ఎలాంటి అధికారక ప్రకటన చేయలేదు మూవీ టీం.

ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు, నటి నటులు గురించి మరిన్ని విషయాలు త్వరలోని వెల్లడించనున్నారు మూవీ మేకర్స్.

హిట్స్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుస ఆఫర్లను అందుకుంటున్నారు విజయ్. ఈ ఏడాది ఫ్యామిలీ స్టార్ తో వచ్చారు. కల్కిలో అర్జునుడిగా కనిపించారు.

ప్రస్తుతం గౌతమ్ తిన్నానూరి దర్సకత్వంలో ఓ చేస్తున్నారు రౌడీ హీరో. ఇందులో శ్రీలీల కథానాయకిగా నటిస్తుంది.

దీని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఆఫీసియల్ అనౌన్స్ మెంట్ ఏమి లేదు.