Ravi Teja : మారెమ్మ సినిమా చూశాను.. చాలా బాగుంది.. నాకు చాలా నచ్చింది : రవితేజ

“మారెమ్మ” సినిమా చూశాను. రూటెడ్, రస్టిక్‌గా ఉంది. నాకు చాలా నచ్చింది. మాధవ్ ట్రాన్స్‌ఫర్మేషన్ బావుంది. సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాని ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మాస్ మహారాజా రవితేజ అన్నారు. రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు.

Ravi Teja : మారెమ్మ సినిమా చూశాను.. చాలా బాగుంది.. నాకు చాలా నచ్చింది : రవితేజ
Raviteja

Updated on: Sep 05, 2026 | 10:11 PM

మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ విలేజ్ యాక్షన్-డ్రామా ‘మారెమ్మ’తో హీరోగా పరిచయం అవుతున్నారు. మంచాల నాగరాజ్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా, మోక్ష ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తోంది. మయూర్ రెడ్డి బండారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. టీజర్, ట్రైలర్ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 10 ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు మాస్ మహారాజా రవితేజ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

Jabardasth Komaram: జబర్దస్త్‌లో నాకు లైఫ్ ఇచ్చి, అన్నం పెట్టింది ఆయనే.. ఆ అన్న వల్లే ఇప్పుడు ఇదంతా

ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. అందరికీ గుడ్ ఈవెనింగ్. ఈ సినిమా చూశాను. చాలా బాగుంది. రియల్ ఇన్సిడెంట్స్‌పై తీశారు. చాలా రూటెడ్‌గా ఉంది. తెలంగాణ మైసాపురం బ్యాక్‌గ్రౌండ్ చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది. డెఫినెట్‌గా జనాలకి బాగా నచ్చుతుందని నమ్ముతున్నాను. ప్రశాంత్ విహారి పాటలు చాలా బాగున్నాయి. తనకి చాలా మంచి ఫ్యూచర్ ఉంది. అలాగే డీఓపీ ప్రశాంత్ వర్క్ చాలా బాగుంది. ఈ సినిమా నిర్మాతలు మయూర్ కుశాల్‌కి మంచి సక్సెస్, మంచి పేరు, డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్లు మరిన్ని మంచి సినిమాలు తీయాలి.

మంచి ఛాన్స్ మిస్ అయ్యాయంది.. ఆ సినిమా చేయలేకపోయా అని చాలా ఫీల్ అయ్యా..

దీపా తెలుగు నేర్చుకుని చక్కగా మాట్లాడారు. వికాస్ అందులో చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశాడు. తనకి ఆల్ ది వెరీ బెస్ట్. నాగరాజుకి ఇది ఫస్ట్ సినిమా అయినప్పటికీ చాలా అద్భుతంగా డైరెక్షన్ చేశారు. ఇలాంటి సబ్జెక్టు ఎంచుకోవడం, అది మాధవ్‌తో చేయడం చాలా బాగుంది. తమ్ముడు మాధవ్ బాగున్నాడు.(నవ్వుతూ) తన ట్రాన్స్‌ఫర్మేషన్ అంతా పర్ఫెక్ట్‌గా ఉంది. తనకి ఆల్ ది వెరీ బెస్ట్. సెప్టెంబర్ 10న సినిమా రిలీజ్ అవుతుంది. అందరూ ఈ సినిమా చూస్తారని, యంగ్ టాలెంట్‌ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. జై సినిమా అంటూ తన స్పీచ్ ను ముగించారు రవితేజ.

ఇవి కూడా చదవండి

8 ఏళ్లుగా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సినిమా.. రూ.25 కోట్లు పెడితే రూ.180 కోట్లు వచ్చాయి.. ఇప్పటికీ ఓటీటీలో ట్రెండింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us