Manchu Vishnu: హద్దులు మీరుతున్నారు… అసభ్యకరంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు.. మంచు విష్ణు స్ట్రాంగ్ వార్నింగ్..

మా అధ్యక్ష పగ్గాలను మంచు విష్ణు చేపట్టిన సంగతి తెలిసిందే.. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మా అసోసియేషన్ అభివృద్దికి ప్రయత్నాలు

Manchu Vishnu: హద్దులు మీరుతున్నారు... అసభ్యకరంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు.. మంచు విష్ణు స్ట్రాంగ్ వార్నింగ్..
Manchu Vishnu

Edited By: Anil kumar poka

Updated on: Oct 25, 2021 | 5:46 PM

మా అధ్యక్ష పగ్గాలను మంచు విష్ణు చేపట్టిన సంగతి తెలిసిందే.. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మా అసోసియేషన్ అభివృద్దికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో హీరోయిన్స్ గురించి తప్పుగా వ్యవహరిస్తూ.. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది.. హీరోయిన్స్ పై అభ్యంతరకర వీడియోలు పెడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.. తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సన్మాన కార్యక్రమంలో మీడియాను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.. కొన్ని యూట్యూబ్ ఛానళ్లు నటుల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నాయని.. అసభ్యకరంగా వ్యవహరించే అలాంటి ఛానళ్లపై తర్యలు తీసుకుంటామన్నారు..

అలాగే కొన్ని యూట్యూబ్ చానళ్స్ థంబ్ నైల్స్ హద్దుతు మీరుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.. నటీమణులు మన ఆడుపడుచులని.. వారిని గౌరవించాలని విజ్ఞప్తి చేశారు.. హీరోయిన్స్ గురించి అభ్యంతరకర వీడియోలు పెడితే ఉపేక్షించమన్నారు.. యూట్యూబ్ చానళ్ల నియంత్రణకు ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. పరిధి దాటే ఇలాంటి యూట్యూబ్ చానళ్లని నియంత్రించడం తన ఎజెండాలో ఓ అంశమని తెలిపారు. తెలుగు మీడియా ఎప్పుడూ హద్దులు దాటలేదని.. తన కుటుంబానికి.. చిత్రపరిశ్రమకు సహకారం అందిస్తూనే ఉందని తెలిపారు.

ఇదిలా ఉంటే… ఇక మా లోని మహిళల భద్రత కోసం ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘విమెన్‌ ఎంపవర్‌మెంట్‌ అండ్‌ గ్రీవెన్స్‌ సెల్‌’ పేరిట కమిటీని ఏర్పాటు చేశామని.. ఈ కమిటీ మహిళా సాధికారత కోసం పనిచేస్తుందని.. ఆ కమిటీకి సలహాదారుగా సునీత కృష్ణన్ ఉంటారని.. అలాగే అందులో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉంటారని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక రోజు రోజుకీ శ్రుతిమించుతున్న సోషల్ మీడియా విషయంలోనూ మంచు విష్ణు నియంత్రణ చర్యలు తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది.

Also Read: Bigg Boss 5 Telugu Promo: బిగ్ షాకిచ్చిన నాగార్జున.. ఆ ఇద్దరిని ఎలిమినేట్ ?..

Bigg Boss 5 Telugu Promo: అడగండి.. లాక్కోండి.. దొంగిలించండి.. ఇంటి సభ్యులను ముప్పుతిప్పలు పెట్టిన నాగ్..

Trailer Talk: నెట్టింట్లో సంచలనం సృష్టిస్తున్న ఎనిమి ట్రైలర్.. విశాల్ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదుగా..