Maa Oori Polimera 2: ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయిన పొలిమేర 2.. ఎక్కడ రిలీజ్ కానుందంటే..
ప్రతి వారం పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇక ఈమధ్య కాలంలో చిన్న సినిమాలు భారీ విజయాలను అందుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అలా వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమా మా ఊరి పొలిమేర 2, చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా మంచి హైప్ క్రియేట్ చేసింది. మా ఊరి పొలిమేర సినిమాకు అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించారు.

ఓటీటీలో సినిమాల రిలీజే కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. కొత్త సినిమాలు థియేటర్స్ లో వచ్చిన నెల రోజులకు ఓటీటీలోకి వచేస్తుంటాయి. ప్రతి వారం పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇక ఈమధ్య కాలంలో చిన్న సినిమాలు భారీ విజయాలను అందుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అలా వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమా మా ఊరి పొలిమేర 2, చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా మంచి హైప్ క్రియేట్ చేసింది. మా ఊరి పొలిమేర సినిమాకు అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా మొదటి భాగం డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. మూఢనమ్మకాలు, చేతబడులు నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో సత్యం రాజేష్, గెటప్ శ్రీను, బాలాదిత్య ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు.
ఈ సినిమాలో సత్యం రాజేష్ పాత్రకు నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు రాజేష్. మొదటి పార్ట్ కు విపరీతమైన రెస్పాన్స్ రావడంతో పొలిమేర 2 ను థియేటర్స్ లో రిలీజ్ చేశారు. మొదటి పార్ట్ ను ఇంట్రస్టింగ్ ట్విస్ట్ తో ఎండ్ చేశారు . దాంతో సెకండ్ పార్ట్ పై మరింత ఆసక్తి నెలకొంది. దాంతో పొలిమేర 2 ను థియేటర్స్ లో రిలీజ్ చేశారు.
థియేటర్స్‌లోనూ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కు రెడీ అయ్యిందని తెలుస్తోంది. డిసెంబర్ 8న పొలిమేర 2 సినిమాను ఓటీటీలో రిలీజే చేయనున్నారని తెలుస్తోంది. పొలిమేర 2 ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ పొలిమేర 2 రైట్స్ ను కొనుగోలు చేసిందని తెలుస్తోంది. త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారని టాక్. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది.
View this post on Instagram
సత్యం రాజేష్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




