MAA Elections: ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణుకి కోటా శ్రీనివాసరావు మద్ధతు.. ప్రకాష్ రాజ్‌కు క్రమశిక్షణ లేదంటూ..

MAA Elections: 'మా' ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ప్రకాష్ రాజ్ ప్యానల్ కు మంచు విష్ణు ప్యానల్ సభ్యుల మధ్య మాటల యుద్ధం..

MAA Elections: ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణుకి కోటా శ్రీనివాసరావు మద్ధతు.. ప్రకాష్ రాజ్‌కు క్రమశిక్షణ లేదంటూ..
Kota Srinivasa Rao

Updated on: Oct 10, 2021 | 5:54 PM

MAA Elections: ‘మా’ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ప్రకాష్ రాజ్ ప్యానల్ కు మంచు విష్ణు ప్యానల్ సభ్యుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. ఇక ఫిల్మ్ ఛాంబర్ నుంచి పోలీస్ మెట్లు వరకూ వెళ్లిన మా ఎన్నికలు రసవత్తరంగా మారిపోయాయి. అయితే పలువురు సీనియన్ల మద్దతుని మంచు విష్ణు కూడగట్టుకుంటున్నారు. ఇప్పటికే కృష్ణ, కృష్ణంరాజు, బాలకృష్ణ వంటివారిని కలిసిన విష్ణుకి తాజాగా మరోసీనియర్ యాక్టర్ తన మద్దతు ప్రకటించారు. అంతేకాదు మా ఎన్నికల్లో మంచు విష్ణు కి ఓటు వెయ్యండి అంటూ నటుడు కోట శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.

మా అధ్యక్షుడిగా అన్ని విధాలుగా అర్హత కలిగిన వ్యక్తి మంచు విష్ణు అని అన్నారు కోటా శ్రీనివాసరావు. ఈ క్రమంలో ప్రకాశ్‌ రాజ్‌కు క్రమశిక్షణ లేదంటూ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రకాష్ రాజ్ తో తాను 15 సినిమాలు చేశానని అతనికి క్రమశిక్షణ లేదని అన్నారు. ఎప్పుడు షూటింగ్ కు సమయానికి రాడు.. కనుక మా ఎన్నికల్లో అలోచించి ఓటువేయమని.. మంచు విష్ణుని గెలిపించమని కోరారు కోటా శ్రీనివాసరావు.

 

Also Read: తెచ్చిన అప్పులు, వచ్చిన ఆదాయం ఎటుపోతోంది.. జీతాలు, ఫించన్లు ఎందుకు ఆలస్యం అంటూ జనసేనాని ప్రశ్న