MAA Elections 2021: మా ఎన్నికలకు ప్రశాంత్ కిషోర్‏ను తీసుకువస్తా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జీవీ..

|

Oct 10, 2021 | 12:17 PM

మా ఎన్నికల్లో ఊహించని పరిణామాలు చేటు చేసుకుంటున్నాయి. పోలింగ్ ప్రారంభమైన ఒక గంట మాత్రమే ప్రశాంతంగా సాగిన ఎన్నికలు..

MAA Elections 2021: మా ఎన్నికలకు ప్రశాంత్ కిషోర్‏ను తీసుకువస్తా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జీవీ..
Maa Elections 2021
Follow us on

మా ఎన్నికల్లో ఊహించని పరిణామాలు చేటు చేసుకుంటున్నాయి. పోలింగ్ ప్రారంభమైన ఒక గంట మాత్రమే ప్రశాంతంగా సాగిన ఎన్నికలు.. ఆ తర్వాత పూర్తిగా గందరగోళంగా మారిపోయాయి. పోలింగ్ బూత్‏లోనే ఇరువురి ప్యానల్ సభ్యులు గొడవకు దిగినట్లుగా తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా జరుగున్న మాటల యుద్ధాలు ఈరోజు కూడా కంటిన్యూ అయినట్లు తెలుస్తోంది. ప్రకాష్ రాజ్, మోహన్ బాబు, నరేష్ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడిచిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. నటుడు శివబాలాజీని.. నటి హేమ కొరకడం గమనార్హం. నో బైటింగ్ ఓన్లీ ఓటింగ్ అంటూ నరేష్ చెప్పుకొచ్చారు. అలాగే శివబాలాజీని హేమ కొరికిందని మీడియా ముందు పేర్కొన్నారు. అయితే హేమ కొరకడం గురించి శివబాలాజీ మాత్రం ఫన్నీగా రియాక్ట్ కాగా.. హేమ మాత్రం.. వాళ్లు ఏం చేయకుండానే కొరికేస్తామా అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి మా ఎన్నికలు మాత్రం రసాభసాగా జరుగుతున్నాయి.

ఇదిలా ఉంటే.. నటుడు జీవీ మాట్లాడుతూ.. మా ఎన్నికలకు ఒక్కటి తక్కువైందని.. ఇక ప్రశాంత్ కిశోర్ రావడం తక్కువ అన్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తే.. డబ్బులిచ్చి మరీ ప్రశాంత్ కిశోర్‏ను తీసుకువస్తానని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రొడ్యూసర్స్, మేనేజర్స్, డైరెక్టర్ మాకు ఫోన్ చేయడమేంటని ప్రశ్నించారు. ఎన్నికల కోసం వాళ్లు ఫోన్ చేయడమేంటీ.. ఆర్టిస్టుల ఎన్నికల్లో వాళ్ల ప్రమేయం ఏంటనీ ప్రశ్నించారు. డబ్బున్న వారు ఫీలిం నగర్, జూబ్లీ హిల్స్, డబ్బు లేని వారు కృష్ణ నగర్, మిడిల్ క్లాస్ వారు మణికొండలో ఉంటున్నారన్నారు. ప్రేమించేవారికంటే.. పుల్లలు పెట్టేవారు ఎక్కువగా ఉన్నారన్నారు. సినీ పరిశ్రమలో ఉన్న పెద్దలను కూర్చుని మాట్లాడితే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఇక జీవీ మాటలతో ఓటర్లను లొబర్చుకోవడానికి దర్శకనిర్మాతలు సైతం రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే..శివబాలజీని హేమ కొరికిందని వీడియో బయటకు వచ్చిన నేపథ్యంలో ఆ విషయంపై స్పందించింది. ఆయన ఏం చేయకుండానే కొరికేస్తామా? అని ప్రశ్నించింది. ఎన్నికలు అయిపోయాక మిగతా విషయాలు మాట్లాడుతాను అని చెప్పుకొచ్చింది హేమ. శివ బాలాజీ తనను అడ్డుకోవడం వల్లే కొరికాను అని హేమ క్లారిటీ ఇచ్చింది.

Also Read: MAA Elections 2021 ‘మా’ సభ్యులు వ్యక్తిగతంగా దూషించుకోవడం బాధాకరం: ఎమ్మెల్యే రోజా

MAA Elections 2021: ‘మా’ ఎన్నికలకు స్టార్‌ హీరోలు దూరం.. ఎవరెవరు అంటే..

MAA Elections 2021: మా ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశాం: వెస్ట్‌జోన్‌ డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌

MAA Elections 2021: హేమ నా చెయ్యి కొరికింది బాబోయ్.. శివ బాలాజీ గగ్గోలు..