సినీ పరిశ్రమలో మా ఎన్నికల రగడ రోజు రోజూకు మలుపులు తిరుగుతున్నాయి. ఎన్నికల సమయం రాకముందే అభ్యర్థులు బహిరంగ విమర్శలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం మా అధ్యక్షుడిగా ఉన్న నరేష్ పై ఇటీవల సినీ నటి హేమ తీవ్ర ఆరోపణలు చేస్తూ.. తన ప్యానెల్ సభ్యులకు వాయిస్ మెసేజ్ పంపిన సంగతి తెలిసిందే. మా అసోసియేషన్ నిధులను నరేష్ దుర్వినియోగం చేశాడంటూ ఆరోపించింది. ఎన్నికలు వెంటనే జరిగిలా చేసేందుకు తనకు సహకరించాలని ప్యానెల్ సభ్యులను కోరుతూ చేసిన వాయిస్ రికార్డ్ బయటపడడంతో మాలో ఎన్నికల రచ్చ మరింత వేడెక్కింది. దీనిపై నరేష్ స్పందిస్తూ.. హేమ వ్యాఖ్యలను ఖండించారు. అసోసియేషన్ గౌరవాన్ని దెబ్బతీసేలా నటి హేమ మాట్లాడుతున్నారని.. అలాగే హేమపై క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కమిటీ నిర్ణయం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ క్రమంలో నటి హేమకు క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
ఇదిలా ఉంటే.. గత కొద్దిరోజులుగా జరుగుతున్న మా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న అభ్యర్థులు మీడియా సమావేశాలు నిర్వహిస్తూ బహిరంగ విమర్శలు చేసుకుంటున్న క్రమంలో నిన్న మెగాస్టార్ చిరంజీవి స్పందించిన సంగతి తెలిసిందే. పోటీ చేస్తున్న సభ్యులు బహిరంగ విమర్శలు చేయడం వలన మా ప్రతిష్ట మసకబారుతుందని.. ఎన్నికలు వెంటనే జరపాలని ఆయన మా క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు లేఖ రాశారు. ఎన్నికలు ఆలస్యమైతే సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోయే అవకాశం ఉందని.. మా ప్రతిష్ట దెబ్బతీస్తున్న ఎవర్నీ కూడా ఉపేక్షీంచవద్దని చిరంజీవి లేఖలో పేర్కోన్నారు. అలాగే ప్రస్తుతం ఏర్పడిన సమస్యను కృష్ణంరాజు త్వరగా పరిష్కరించాలని కోరుకుంటున్నట్లుగా చిరంజీవి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మా క్రమశిక్షణ సంఘం రంగంలోకి దిగినట్లుగా అర్థమవుతుంది.
Viral Pic: ఈ చిన్నారి ఇప్పుడొక టాప్ హీరోయిన్.. ఫ్యాన్స్‌లో పిచ్చ క్రేజ్.. కనిపెట్టండి చూద్దాం!