టాలీవుడ్‌లో ఇక అసలు సిసలు యుద్ధం మొదలుకాబోతోంది. ఇక నేటి నుంచి ఎన్నికల హీట్ మరింత వేడెక్కిపోయే సీన్ కనిపిస్తోంది. మా ఎన్నికల్లో పోటీ కోసం ఇవాళ్టి నుంచి నామినేషన్లు జరగబోతున్నాయి. మొదటి నుంచి ఎన్నికల కోసం ఆరాటపడతూ వచ్చిన ప్రకాష్ రాజ్ టీమ్ ఇవాళ నామినేషన్స్ వెయ్యబోతోంది. మా అధ్యక్ష పదవికి ప్రకాష్‌రాజ్.. మిగతా ప్యానెల్ ఈ మధ్యాహ్నం పత్రాలు సమర్పించనున్నారు.
ఇక పోటీలో ప్రకాష్ రాజ్ కు ధీటుగా వస్తునన మంచు విష్ణు, ఆయన ప్యానెల్ రేపు నామినేషన్ వేస్తారు. అక్టోబర్ 10న ఎన్నికలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరగనున్నాయి. అధ్యక్ష పదవికి ప్రకాష్‌రాజ్, మంచు విష్ణు, సీవీఎల్ నరసింహారావు పోటీ పడుతున్నారు. ఇక జనరల్ సెక్రటరీ పదవికి.. బండ్ల గణేష్ స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు. ఈరోజు ప్రకాష్ రాజ్.. అండ్ టీం నామినేషన్ వేయనున్నారు. కాష్ రాజ్ ప్యానల్ లో 18 మంది ఎక్జిక్యూటివ్ మెంబెర్స్ ఉన్నారు. వారిలో..జయసూధ, అనసూయ-అజయ్-భూపాల్-బ్రహ్మాజీ-ఈటీవి ప్రభాకర్-గోవింద్ రావు-ఖయ్యుం-కౌశిక్-ప్రగతి-రమణారెడ్డి-శ్రీధర్ రావు-శివారెడ్డి-సమీర్-సుడిగాలి సుధీర్-సుబ్బరాజు-సురేష్ కొండేటి-తనీష్-టార్జాన్ ఉన్నారు . ఇందులో కోశాధికారి-నాగినీడు-జాయింట్ సెక్రటరీ…అనితా చౌదరి-జాయింట్ సెక్రటరీగా ఉత్తేజ్-వైస్ ప్రెసిడెంట్‌గా బెనర్జీ-వైస్ ప్రెసిడెంట్‌గాహేమ-ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గాశ్రీకాంత్-జనరల్ సెక్రెటరీగా జీవిత రాజశేఖర్-అధ్యక్షుడిగా ప్రకాష్ రాజ్ పేర్లు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 29వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 30న నామినేషన్‌ల పరిశీలన ఉండనుంది. అలాగే.. అక్టోబర్1-2 తేదీల్లో నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. ఇక అక్టోబర్ 10 ఉదయం ఎలక్షన్స్ నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం ఫలితాలను ప్రకటిస్తారు. ఇదిలా ఉంటే.. మెగా ఫ్యామిలీ అండదండలతో ప్రకాష్ రాజ్ బరిలో ఉండగా.. . కృష్ణంరాజు, కృష్ణ, బాలకృష్ణ లాంటి సీనియర్ నటులు మంచు విష్ణుకు అండగా ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: Adipurush: ఆదిపురుష్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్రకటించిన చిత్రయూనిట్.. ఎప్పుడంటే..
శ్రీవారిని దర్శించుకున్న దిల్‌రాజు.. వంశీ పైడిపల్లి.. ప్రియుడితో కలిసి తిరుమలకు లేడీ సూపర్ స్టార్..