MAA Elections 2021: సిని’మా’ వార్.. రాజకీయం, సవాళ్లు, ఆరోపణల నుంచి ఫిర్యాదుల దాకా వెళ్లిన ‘మా’ సమరం..

|

Oct 05, 2021 | 12:30 PM

మా ఎన్నికల్లో రాజకీయం.. సవాళ్లు, ఆరోపణల నుంచి ఫిర్యాదుల దాకా వెళ్లింది. మొన్న జీవితపై రఘుబాబు ఈసీకి ఫిర్యాదు చేస్తే.. లెటెస్ట్‌గా మోనార్క్‌ పోస్టల్ బ్యాలెట్‌ దుర్వినియోగంపై కదం తొక్కారు.

MAA Elections 2021: సినిమా వార్.. రాజకీయం, సవాళ్లు, ఆరోపణల నుంచి ఫిర్యాదుల దాకా వెళ్లిన మా సమరం..
Maa
Follow us on

MAA Elections 2021: గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మా ఎన్నికలలో తెలుగు భాష.. లోకల్, నాన్ లోకల్ అనే వాదనలు వినిపించాయి. అంతేకాకుండా.. ప్రకాష్ రాజ్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తుండడంతో.. పలువురు సినీ ప్రముఖులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా.. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో ఈసారి మా ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. అలాగే ఈసారి మా అధ్యక్ష పదవి కోసం మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ పోటీ పడుతుండడంతో మా ఎన్నికలు హీటెక్కాయి. మా ఎన్నికల్లో రాజకీయం.. సవాళ్లు, ఆరోపణల నుంచి ఫిర్యాదుల దాకా వెళ్లింది. మొన్న జీవితపై రఘుబాబు ఈసీకి ఫిర్యాదు చేస్తే.. లెటెస్ట్‌గా మోనార్క్‌ పోస్టల్ బ్యాలెట్‌ దుర్వినియోగంపై కదం తొక్కారు. అడ్డదారిలో గెలిచేందుకు ప్రత్యర్థి వర్గం ప్రయత్నిస్తోందంటూ కంప్లయింట్ చేశారు. పోస్టల్ బ్యాలెట్లు వేర్వేరు ప్రాంతాల నుంచి ఓకే రకంగా ఎందుకు వస్తున్నాయో పరిశీలించాలని ఎలక్షన్‌ ఆఫీసర్‌కి కోరారు. 60ఏళ్లకు పైబడిన వాళ్లు పోస్ట్ బ్యాలెట్‌కి అర్హులు. అలాంటివాళ్లు 30వ తేదీలోపు ఈసీకి లెటర్ రాయాలి. అడ్రస్‌ సంతకం లాంటి వివరాలతో లెటర్‌ పంపించాలి. కానీ ఇప్పుడు వస్తున్న లెటర్లన్నీ ఓకేలా ఉండడంపై ప్రకాష్‌రాజ్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే అడ్డదారిలో గెలిచేందుకు ప్రత్యర్థి వర్గం ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తున్నారాయన.

గెలుస్తాం గెలుస్తాం అని విష్ణు అండ్ కో కాన్ఫిడెంట్‌గా చెబుతుంటే ఏమో అనుకున్నాం. కానీ ఇలా అడ్డదారిలో గెలవడానికి ప్రత్యర్థి వర్గం ప్లాన్ చేస్తోందని ఊహించలేకపోయామన్నారు జీవిత. సభ్యులు ఆలోచించి ఓటేయాలని విఙ్ఞప్తి చేశారామె.
పోస్టల్ బ్యాలెట్‌ దుర్వినియోగంపై ఫిర్యాదు చేసిన ప్రకాష్‌ రాజ్‌ భావోద్వేగానికి లోనయ్యారు. కళ్లల్లోంచి ఉబికి వచ్చే కన్నీళ్లను దిగమింగుకుంటూ మాట్లాడారాయన. ఇక ఏడ్చేస్తారేమో అనుకున్నారంతా. కానీ తన్నుకొచ్చే ఆవేశాన్ని ఆపుకుంటూ.. ఇలా గెలుస్తారా అని నిలదీశారు. 60మందితో అనుకూలంగా ఓటు వేయించుకున్నారని ఆరోపించారు ప్రకాష్‌. వారిలో కృష్ణ, కృష్ణంరాజు, పరుచూరి బ్రదర్స్‌, శారద, శరత్‌బాబు లాంటి సీనియర్ నటులు ఉన్నారని చెప్పుకొచ్చారు మోనార్క్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

హతవిధీ.. ఒకరితర్వాత మరొకరు.. టాలీవుడ్‌కి ఇదో కొత్త గండం..! ఎందుకిలా జరుగుతుంది..!!

Megastar Chiranjeevi: మెగాస్టార్ కోసం బరిలోకి దిగిన యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్…

Aryan Khan drug case: ఆర్యన్‌ఖాన్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. మూడ్రోజుల కస్టడీ.. మరో ఇద్దరి అరెస్ట్..