MAA elections 2021: విజయం ఇచ్చిన ఆనందం.. కన్నీళ్లు పెట్టుకున్న మంచు విష్ణు..

మా ఎన్నికలు నిన్నటివరకు ఎక్కడ చూసిన ఇదే చర్చ.. అధ్యక్ష పదవి కోసం పోటీ చేసిన ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ఎవరి వ్యహారచన వారు చేసుకుంటూ పోటీని రసవత్తరం చేశారు.

MAA elections 2021: విజయం ఇచ్చిన ఆనందం.. కన్నీళ్లు పెట్టుకున్న మంచు విష్ణు..
Vishnu

Edited By: Ravi Kiran

Updated on: Oct 11, 2021 | 11:31 AM

MAA elections 2021: మా ఎన్నికలు నిన్నటి వరకు ఎక్కడ చూసిన ఇదే చర్చ.. అధ్యక్ష పదవి కోసం పోటీ చేసిన ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ఎవరి వ్యహారచన వారు చేసుకుంటూ పోటీని రసవత్తరం చేశారు. ఈ నేపథ్యంలో పోటీలో పాల్గొన్న రెండు ప్యానల్స్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ అసెంబ్లీ ఎన్నికల వాతావరణాన్ని తీసుకొచ్చారని ఇండస్ట్రీ జనాలే అనుకుంటున్నారు. ఇక మంచు విష్ణు కృష్ణ, కృష్ణం రాజు, బాలకృష్ణ , కోట శ్రీనివాస్ రావు లాంటి లాపెద్దలను కలిసి తమ మద్దతు కావాలని కోరగా.. అటు ప్రకాష్ రాజ్ తనకు ఎలాంటి పెద్దల సపోర్ట్ అవసరం లేదు అంటూ.. దూకుడుగా ముందుకు సాగరు. ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీ సపోర్ట్ నాకే అంటూ మొదటి నుంచి మంచు విష్ణు చెప్తున్నా .. మెగా బ్రదర్ నాగబాబు మాత్రం ప్రకాష్ రాజ్‌కు సపోర్ట్ చేశారు. ఇన్ని ట్విస్ట్‌ల మధ్య మొత్తానికి ఎన్నికలు పూర్తయ్యాయి.

ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు ఘనవిజయం సాధించారు. ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు 107 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక ఈ ఎన్నికల్లో మంచు విష్ణు విజయం సాగించారని ఎన్నికల అధికారి ప్రకటించారు. ఆసమయంలో మంచు విష్ణు భావోద్వేగానికి గురయ్యారు. విజయం ఊహించిందే అయినప్పటికీ మంచు విష్ణు ఎమోషనల్ అయ్యారు. విజయం తర్వాత మాట్లాడ లేకపోయారు విష్ణు. విష్ణును నరేష్ ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇక మోహన్ బాబు మాట్లాడుతూ.. ఇది అందరి విజయం అన్నారు. అందరికి మంచు విష్ణు ఆశీసులు ఉండాలని కోరుకున్నారు. కృష్ణ, కృష్ణం రాజు, బాలకృష్ణ లతోపాటు పవన్ కళ్యాణ్ ఆశీసులు కూడా ఉండాలని కోరారు మోహన్ బాబు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

MAA elections 2021:: ఎవరు గెలిచినా మన కుటుంబం గెలిచినట్టే.. విష్ణుకు అభినందనలు తెలిపిన మెగాస్టార్..

Bigg Boss 5 Telugu: శ్రీరామచంద్ర పాటకు కన్నీరు పెట్టుకున్న హమీద..

Vishnu Vs Prakash Raj: విష్ణుకి ప్లస్ అయిన అంశాలు.. ప్రకాష్ రాజ్‌కి మైనస్ అయిన అంశాలు ఇవే..