MAA Elections 2021: ‘మా’లో లొల్లి చిలికి చిలికి గాలివానలా తయారయ్యింది. సినిమాను మించి ట్విస్ట్‌లతో, గొడవలతో నానా రచ్చగా ఉంది’ మా’. మైక్ కనిపిస్తే చాలు ఒకరి మీద ఒకరు విమర్శలతో విరుచుకుపడుతున్నారు. దీంతో ‘మా’లో లుకలుకలన్నీ బయటపడిపోతున్నాయి. ఈ సారి ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ – మంచు విష్ణు అధ్యక్ష పదవికి పోటీపడుతున్నారు. మరో నలుగురిలో హేమ- జీవిత- సీవీఎల్ వంటి వారు రేసులో ఉన్నారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన ప్యానల్‌ను కూడా అనౌన్స్ చేశారు. ఇక నరేష్ వర్గంలోని 100 ఓట్లు కూడా ఈ సారి ఎన్నికల్లో కీలకం కానున్నాయి. ఎవరు గెలిచినా 2021-24 సీజన్‌కి అధ్యక్షుడిగా ‘మా’ను ఏలుతారు. ఇన్నాళ్లు ఏకగ్రీవం అంటూ వినిపించినా.. దానికంటే ఎన్నికలే బెటరనే ఉద్ధేశం పెద్దల్లో బయటపడడంతో.. ఎన్నికల పోరులో ఎవరికి వారు రాజకీయాలు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో నటి హేమ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. మా నిధుల దుర్వినియోగానికి గురయ్యాయని ఆమె ఓ వాయిస్ మెసేజ్ ద్వారా ఆరోపించడంతో రచ్చ మొదలైంది. హేమ పై సీనియర్ నరేష్ సీరియస్ అయ్యారు. ఆమె పై క్రమ శిక్షణ సంఘం చర్యలు తీసుకోవాలని అన్నారు. నరేష్‌తోపాటు జీవిత రాజశేఖర్ కూడా హేమ పై ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో హేమ చేసిన ఆరోపణలపై షోకాజ్ నోటీసులు ఇచ్చింది క్రమశిక్షణ సంఘం.
ఇదిలా ఉంటే శనివారం ఫిలిం ఛాంబర్‌లో కొందరు మా సభ్యులు ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. “మా” నిబంధనలను ఉల్లంఘించిన కొందరు మా సభ్యుల పై క్రమ శిక్షణ సంఘం చైర్మన్ కృష్ణంరాజుకి పిర్యాదు చేశారు మా సభ్యులు. దాదాపు వందకు పైగా సభ్యుల సంతకాలతో ఫిర్యాదును సిద్ధం చేశారు. అయితే నాలుగురోజుల క్రితమే కృష్ణంరాజుకు మెగాస్టార్ చిరంజీవి లేఖ రాశారు. మా సభ్యులు చేస్తున్న బహిరంగ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాలి అంటు లేఖలో చిరంజీవి కోరారు. మా ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించే సభ్యులను ఉపేక్షించ వద్దు అని చిరంజీవి కృష్ణంరాజును కోరారు. మరో వైపు ఈ నెల 22 న మా జనరల్ బాడీ మీటింగ్‌లో మా ఎలక్షన్స్ తేదీ ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :
Vijay-Dhoni: విజయ్‌ని కలిసిన క్రికెటర్ ధోనీ.. వివాదంగా మారిన పోస్టర్లు.. ఇంతకీ అందులో ఏముందంటే..
Vishwak Sen: పాగల్ ప్రమోషన్స్‌తో దుమ్మురేపుతున్న విశ్వక్ సేన్.. యాంకర్‌తో ఇలా డాన్స్‌లు
Lakshya: అదరహో అనిపిస్తున్న అందాల కేతిక.. నాగశౌర్య ‘లక్ష్య’ నుంచి గ్లిమ్స్ విడుదల..