MAA Elections 2021: నేడు మా అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్.. కీలక అంశాలపై చర్చ..

|

Aug 22, 2021 | 9:30 AM

గత కొద్ది రోజులుగా చిత్రపరిశ్రమలో ఎన్నికల హడావిడి మొదలైన సంగతి తెలసిందే. గతంలో ఎన్నడులేని విధంగా.. ఈసారి మా అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య పెరిగింది.

MAA Elections 2021: నేడు మా అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్.. కీలక అంశాలపై చర్చ..
Maa Election
Follow us on

గత కొద్ది రోజులుగా చిత్రపరిశ్రమలో ఎన్నికల హడావిడి మొదలైన సంగతి తెలసిందే.  మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. గతంలోకంటే రంజుగా అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తూ రోజు రోజుకీ ఉత్కంఠ రేపుతున్నాయి. గతంలో ఎన్నడులేని విధంగా.. ఈసారి మా అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య పెరిగింది. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్, జీవితా రాజశేఖర్, హేమ, సీవీఎల్ వంటి వారు మా అధ్యక్ష పదవి కోసం పోటీలో ఉన్నారు. ఇప్పటికే తమ ప్యానెల్ అభ్యర్థులను ప్రకటించమే కాకుండా.. బహిరంగ విమర్శలు చేసుకుంటున్నారు. ఇక ఇటీవల నటి హేమ ప్రస్తుత మా అద్యక్షుడు నరేష్ పై తీవ్ర విమర్శలు చేసిన ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో హేమ పై చర్యలు తీసుకోవాలని.. నరేష్ మా క్రమ శిక్షణ సంఘంకు ఫిర్యాదు చేశాడు. వెంటనే వివరణ ఇవ్వాలంటూ మా క్రమశిక్షణ సంఘం నటి హేమకు నోటీసులు జారీ చేసింది. ఇక నిన్న మంచు విష్ణు సైతం మా బిల్డింగ్ కోసం స్థలాన్ని కూడా ఎంపిక చేసినట్లుగా వీడియోలో వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ఇవాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించనున్నారు. ఈరోజు (ఆగస్ట్ 22న) ఉదయం 10 గంటలకు కానున్న మీటింగ్ ప్రారంభం కానుంది. వర్చువల్ పద్దతిలో సర్వసభ్య సమావేశం జరగనుంది. ఇందులో రెండు సంవత్సరాల జమ ఖర్చులు, మా సభ్యుల సంక్షేమ కార్యక్రమాలు, మా ఎన్నికల నిర్వహణ పై చర్చ నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. అలాగే మా ఎన్నికల తేదీని కూడా ప్రకటించే అవకాశం ఉంది.

\

Also Read: Megastar Chiranjeevi: సంబరాలు మొదలెట్టిన అభిమానులు.. మెగాస్టార్‏కు వినూత్న రీతిలో శుభాకాంక్షలు..

Brother Sister Songs: మాటల్లో వర్ణించలేని అన్నాచెల్లెళ్ల బంధానికి ప్రతిరూపం ఈ మధుర గీతాలు..

Sumanth: ఏంటో ఏమో జీవితం.. ఎందుకిలా చేస్తాదో జీవితం లిరికల్ సాంగ్ రిలీజ్.. వైవిధ్యంగా మళ్లీ మొదలైంది..

Chiranjeevi Birthday: చిరంజీవి బ్లడ్‌ బ్యాంకు ఏర్పాటు చేయడానికి కారణమేంటో తెలుసా? ఆయన ఆలోచన మార్చిన ఆ సంఘటన ఏంటంటే.