Naa Saamiranga: 28 ఏళ్లుగా వెన్నంటే ఉంటూ ప్రోత్సాహం.. కీరవాణికి చంద్రబోస్ పాదాభివందనం..

సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా నా సామిరంగ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్‏లో గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఈవేడుకలో ఆషికా మాట్లాడుతూ.. ఈ సినిమాలో నాగార్జున పక్కన నటించడం చాలా అదృష్టమని.. ఆయనతో పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో తెలియదని.. కానీ ఫస్ట్ లుక్ టెస్ట్ చేయడానికి కలిసినప్పుడే చాలా సపోర్టివ్ గా అనిపించారని చెప్పుకొచ్చింది.

Naa Saamiranga: 28 ఏళ్లుగా వెన్నంటే ఉంటూ ప్రోత్సాహం.. కీరవాణికి చంద్రబోస్ పాదాభివందనం..
Chandrabose

Updated on: Jan 10, 2024 | 10:09 PM

అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం నా సామిరంగ. ఈ మూవీతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్, ఆషికా రంగనాథ్, మిర్నా, రుక్సాన్ థిల్లన్ కీలకపాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా నా సామిరంగ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్‏లో గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఈవేడుకలో ఆషికా మాట్లాడుతూ.. ఈ సినిమాలో నాగార్జున పక్కన నటించడం చాలా అదృష్టమని.. ఆయనతో పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో తెలియదని.. కానీ ఫస్ట్ లుక్ టెస్ట్ చేయడానికి కలిసినప్పుడే చాలా సపోర్టివ్ గా అనిపించారని చెప్పుకొచ్చింది.

ఇక ఇదే వేడుకలో కీరవాణి మాట్లాడుతూ.. “కొత్త టెక్నీషియన్లను గుర్తించి వారికి సపోర్ట్ ఇచ్చే నాగార్జున గారికి నేనెప్పుడూ రుణపడి ఉంటాను” అని అన్నారు. ఆ తర్వాత చంద్రబోస్ మాట్లాడుతూ.. “కీరవాణి గారిని, నన్ను ఇద్దరినీ స్టేజ్ పైకి నాగార్జున గారు ఆహ్వానించడమే పెద్ద గౌరవం. 28 సంవత్సరాలుగా నన్ను నా ప్రతిభను ప్రోత్సహిస్తూ తనతోపాటు నా ప్రతిభను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన కీరవాణి గారికి మనస్పూర్తిగా పాదాభివందనాలు. ఎన్నో పాటలు నా చేత రాయించి అనుక్షణం మన ప్రోత్సహిస్తున్న నా అన్నలాంటి కీరవాణిగారు నా జీవితంలో లభించడం నా అదృష్టం ఈ సినిమాలో కీరవాణి గారి స్వర సహకారంతో నాలుగు అద్భుతమైన పాటలు రాశాను. చాలా మంచి పాటలుగా విని మిగిలిపోతాయి” అని అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.