Love Today: లవ్ టుడే హీరోకు వింత అనుభవం.. ఫ్యాన్ చేసిన పనికి షాక్ అయ్యాడు పాపం

|

Nov 29, 2022 | 10:39 AM

తమిళ్ సినిమా లవ్ టుడే మూవీ కూడా భారీ విజయాన్ని అందుకుంది. యూత్ కు బాగా కనెక్ట్ అయ్యే కథతో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించింది.

Love Today: లవ్ టుడే హీరోకు వింత అనుభవం.. ఫ్యాన్ చేసిన పనికి షాక్ అయ్యాడు పాపం
Love Today
Follow us on

ఇటీవల వచ్చిన సినిమాలో చిన్న సినిమాలు సంచలన విజయాలనుఅందుకుంటున్న విషయం తెలిసిందే. రీసెంట్ డేస్ లో వచ్చిన కాంతారా సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న సినిమాగా 16కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ దాదాపు 400 కోట్లు వసూల్ చేసింది. అలాగే తమిళ్ సినిమా లవ్ టుడే మూవీ కూడా భారీ విజయాన్ని అందుకుంది. యూత్ కు బాగా కనెక్ట్ అయ్యే కథతో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. కేవలం ఐదు కోట్ల బడ్జెత్‌తో నిర్మిత‌మైన లవ్ టుడే సినిమా అర‌వై కోట్లకుపైగా వసూళ్లు రాబ‌ట్టింది. దీంతో ఈ సినిమాను అదే పేరుతో దిల్‌రాజు తెలుగులోకి డ‌బ్ చేశారు. గత శుక్రవారం (నవంబర్‌ 25న) థియేటర్లలో విడుదలైన ఈ రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌కు ఇక్కడ కూడా పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. ప్రేమకథకు కామెడీని జోడించి ఎంతో ఆసక్తికరంగా ఈ సినిమాను తీర్చిదిద్దాడు ప్రదీప్‌.

తాజాగా ఈ సినిమా థియేటర్స్ లో అభిమానులతో కలిసి సినిమా చూశాడు హీరో ప్రదీప్‌. అయితే అదే సమయంలో ఈ మూవీ చూసిన ఓ ప్రేక్షకుడు పెరిగేతుకుంటూ వెళ్లి అతడిని పైకి ఎత్తుకున్నాడు. “బ్రో ఎంత బాగుంది బ్రో సినిమా నాకు బాగా నచ్చేసింది” అంటూ హీరోని ఉక్కిరి బిక్కిరి చేశాడు. ఆ ప్రేక్షకుడి రియాక్షన్ చేసి హీరో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తాజాగా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకి ఫన్ యాడ్ చేసి సోషల్ మీడియాలో వదిలారు కొందరు.

ఇవి కూడా చదవండి

ఇక ఈ చిత్రంలో ప్రదీప్‌కు జోడీగా ఇవానా, రవీనా రవి హీరోయిన్లుగా నటించారు. సత్యరాజ్‌, రాధికా, యోగిబాబు కీలకపాత్ర పోషించారు. యువన్‌ శంకర్‌ రాజా అందించిన పాటలు శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటే థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోన్న లవ్‌టుడే సినిమా అప్పుడే ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. డిసెంబర్ 2న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..