Leo Movie Release: ఈ దసరాకు రిలీజ్ అవుతున్న సినిమాల్లో పాన్ ఇండియా రేంజ్‌లో బజ్ క్రియేట్ చేస్తున్న మూవీ లియో. విక్రమ్ సక్సెస్ తరువాత లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న సినిమా కావటం. అది కూడా విజయ్ లాంటి టాప్ స్టార్‌తో కావటంతో కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్, బాలీవుడ్‌లో కూడా ఈ సినిమా అంచనాలు భారీగానే ఉన్నాయి. రిలీజ్‌కు ముందే పలు రికార్డులను లియో తిరగరాయడం పక్కా అని ట్రేడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
అయితే క్రేజ్‌ను క్యాష్ చేసుకునే ఛాన్స్ మిస్ చేసుకుంది లియో టీమ్. ఇంత బజ్ ఉన్న సినిమాకు ఇంకాస్త ప్రమోషన్ చేసి ఉంటే ఓపెనింగ్స్ మరో లెవల్‌లో ఉండేవన్న అంచనాలు ఉన్నాయి. ఆల్రెడీ లియో అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఆల్ టైమ్ రికార్డ్స్ సెట్ చేస్తోంది. ఏ మాత్రం ప్రమోషన్ లేకుండానే ఇలా ఉంటే… ఒక్క ఈవెంట్ చేసుంటే ఆ రేంజ్ నెక్ట్స్ లెవల్‌లో ఉండేదంటున్నారు ఫ్యాన్స్. లియో టీమ్ కూడా ఆ మధ్య భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్లాన్ చేసింది. ముందు చెన్నైలోనే ఈవెంట్ చేయాలని ప్లాన్ చేసినా… పర్మిషన్స్ రాలేదు. దీంతో ప్రీ రిలీజ్ వెన్యూను హైదరాబాద్‌కు షిఫ్ట్ చేస్తారని, ఇక్కడ బిగ్ ఈవెంట్ సెలబ్రేట్ చేస్తారన్న టాక్ వినిపించింది. కానీ అది కూడా జరగలేదు.
అక్టోబర్ 19న ఈ మూవీ భారత్‌లో రిలీజ్ అవుతుండగా.. యూఎస్‌లో అక్టోబర్ 18న ప్రీమియర్ కానుంది. అమెరికాలో ఈ మూవీ ప్రీమియర్ అయ్యే షోస్ విషయంలో షారుఖ్ ఖాన్ మూవీ జవాన్ రికార్డులను లియో బద్దలుకొట్టింది. జవాన్ మూవీని అక్కడ 1600 షోస్ వేయగా.. లియో మూవీని 1755 షోస్ వేస్తున్నారు. అంటే జవాన్ మూవీ కంటే 155 షోస్ ఎక్కువగా లియోను ప్రదర్శించనున్నారు. యూఎస్‌లో ఎక్కువగా తమిళ్, తెలుగులో ఈ మూవీని రిలీజ్ చేయగా.. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే హిందీ వెర్షన్‌ను ప్రీమియర్ చేస్తున్నారు.
లియో సినిమాతో ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా మార్కెట్ మీద సీరియస్‌గా ఫోకస్ చేశారు మేకర్స్. ఇలాంటి సినిమా ఒక్క ఈవెంట్ కూడా జరగకుండానే ఆడియన్స్ ముందుకు వస్తుండటం ఫ్యాన్స్‌ను నిరాశపరిచే అంశమే. అయితే సినిమా రిజల్ట్ విషయంలో ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్న మేకర్స్, ఆఫ్టర్ రిలీజ్ సక్సెస్ సెల్రబేషన్స్‌ను నెవ్వర్ బిఫోర్ రేంజ్‌లో సెలబ్రేట్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది.