Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ ‘వదిన’ అని పిలవడంపై లావణ్య రియాక్షన్.. కేవలం ఆ ఒక్కరే పిలుస్తారట..
ఇటలీలో వీరి వివాహం 2023 నవంబర్ 1న ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత కొద్ది రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న లావణ్య.. ఇప్పుడు మళ్లీ కెరీర్ స్టార్ట్ చేసింది. మ్యారేజ్ తర్వాత ఆమె నటించిన వెబ్ సిరీస్ మిస్ పర్ఫెక్ట్. ప్రస్తుతం ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
మెగా ఫ్యామిలీలోకి చిన్న కోడలుగా అడుగుపెట్టారు హీరోయిన్ లావణ్య త్రిపాఠి. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు హీరో వరుణ్ తేజ్‌తో గతేడాది కలిసి ఏడడుగులు వేశారు. దాదాపు ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు ఇరు కుుటుంబ సభ్యుల సమక్షంలో మూడు మూళ్ల బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఇటలీలో వీరి వివాహం 2023 నవంబర్ 1న ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత కొద్ది రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న లావణ్య.. ఇప్పుడు మళ్లీ కెరీర్ స్టార్ట్ చేసింది. మ్యారేజ్ తర్వాత ఆమె నటించిన వెబ్ సిరీస్ మిస్ పర్ఫెక్ట్. ప్రస్తుతం ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో అభిజీత్ హీరోగా కనిపించాడు. ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు లావణ్య. ఈ క్రమంలో పెళ్లి తర్వాత తన జీవితంలో జరిగిన మార్పులు.. తమ ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
అలాగే మెగా ఫ్యాన్స్ అంతా తనను వదిన అని పిలవడంపై ఫస్ట్ టైమ్ రియాక్ట్ అయ్యారు లావణ్య. మెగా ఫ్యామిలీలో తనని వదిన అని పిలిచేది.. కేవలం వరుణ్ చెల్లెలు నిహారిక మాత్రమే అని అన్నారు. దీంతో యాంకర్ కల్పించుకుని మెగా ఫ్యాన్స్ అంతా మిమ్మల్ని వదిన అనే పిలుస్తారు అని చెప్పగా.. లావణ్య రియాక్ట్ అవుతూ.. అవునా.. సో స్వీట్ అంటా కామెంట్స్ చేసింది.
మెగా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు తనను ఎంతో ప్రేమతో ఆహ్వానించారని.. కేవలం ఆ కుటుంబం మాత్రమే కాకుండా.. ఆ ఫ్యామిలీకి చెందిన అభిమానుల ప్రేమను కూడా తాను పొందుతున్నాని.. మెగా ఫ్యామిలీలోకి అడుగుపెట్టడం ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం లావణ్య కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన లావణ్య.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. ఇప్పటివరకు ఆమె నటించిన సినిమాలు తక్కువే అయినా.. వైవిధ్యమైన కథనాలను ఎంచుకుంటుంది .
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.