Mastan Sai case: మస్తాన్ సాయి కేసులో మరో ట్విస్ట్.. ఏపీ గవర్నర్‌కు లావణ్య లాయర్ లేఖ..

సంచలనం సృష్టించిన కామపిశాచి మస్తాన్‌ సాయికి రిమాండ్‌ విధించింది కోర్టు. మూడ్రోజుల కస్టడీ ముగియడంతో… వైద్య పరీక్షల తర్వాత అతడ్ని రంగారెడ్డి కోర్టులో హాజరుపరిచారు నార్సింగి పోలీసులు. దీంతో 14రోజలపాటు రిమాండ్ విధిస్తూ కోర్టు నిర్ణయించడంతో… అతడ్ని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇక మూడ్రోజుల పాటు మస్తాన్‌సాయిని కస్టడీలోకి తీసుకుని విచారించిన నార్సింగి పోలీసులు… అతనిపై ప్రశ్నల వర్షం కురిపించారు

Mastan Sai case: మస్తాన్ సాయి కేసులో మరో ట్విస్ట్.. ఏపీ గవర్నర్‌కు లావణ్య లాయర్ లేఖ..
Mastan Sai Case

Updated on: Feb 16, 2025 | 7:16 PM

రాజ్‌ తరుణ్, లావణ్య, మస్తాన్ సాయి.. ఈ ముగ్గురి ట్రయాంగిల్ పిక్చర్‌లో రోజుకో ట్విస్ట్‌ వెలుగుచూస్తోంది. తనకు ప్రాణభయం ఉంది, తనను చంపేస్తారని రెండు రోజుల క్రితం టీవీ9కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కన్నీటి పర్యంతమైంది లావణ్య. కాగా లావణ్య వ్యాఖ్యలను ఖండిస్తున్నారు మస్తాన్ సాయి పేరెంట్స్. తాము అలాంటి వాళ్లము కాదని స్పష్టం చేస్తున్నారు. లావణ్య వల్లే మస్తాన్‌సాయికి డ్రగ్స్ అలవాటు అయ్యాయి అని వారు ఆరోపిస్తున్నారు. తమ కొడుకుకి పెళ్లైన తర్వాత కూడా పెళ్లి చేసుకోవాలని ఆమె వేధించిందని టీవీ9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు మస్తాన్ సాయి పేరెంట్స్.

సంచలనం సృష్టించిన కామపిశాచి మస్తాన్‌ సాయికి రిమాండ్‌ విధించింది కోర్టు. మూడ్రోజుల కస్టడీ ముగియడంతో… వైద్య పరీక్షల తర్వాత అతడ్ని రంగారెడ్డి కోర్టులో హాజరుపరిచారు నార్సింగి పోలీసులు. దీంతో 14రోజలపాటు రిమాండ్ విధిస్తూ కోర్టు నిర్ణయించడంతో… అతడ్ని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇక మూడ్రోజుల పాటు మస్తాన్‌సాయిని కస్టడీలోకి తీసుకుని విచారించిన నార్సింగి పోలీసులు… అతనిపై ప్రశ్నల వర్షం కురిపించారు. హార్ట్‌డిస్క్‌, డ్రగ్స్‌ అంశాలపై కొశ్చన్‌ చేశారు. అయితే హార్డ్‌డిస్క్‌లోని న్యూడ్ వీడియోలు, అమ్మాయిలను ట్రాప్‌ చేయడంపై పోలీసుల ప్రశ్నలకు మస్తాన్‌సాయి సమాధానం ఇవ్వనట్లు తెలుస్తోంది. తన ఇద్దరు గర్ల్‌ఫ్రెండ్స్‌, భార్యతో ఉన్న వీడియోలు మాత్రమే హార్డ్‌డిస్క్‌లో ఉన్నట్లు మస్తాన్‌ పోలీసులకు చెప్పినట్లు సమాచారం.

అలాగే మస్తాన్‌ హార్డ్‌డిస్క్‌లో 200మంది అమ్మాయిల వీడియోలను వారివారి పేర్లతో ఒక్కో ఫోల్డర్‌ క్రియేట్‌ చేసి పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఇటు మస్తాన్‌సాయి వాట్సాప్‌ చాటింగ్‌ను రిట్రీవ్ చేసేందుకు పోలీసులు సిద్దమయ్యారు. అలాగే మస్తాన్‌సాయి ఇంట్లో జరిగిన డ్రగ్స్‌ పార్టీలపైనా ఫోకస్‌ పెట్టారు. అయితే డ్రగ్స్‌ పార్టీలకు సంబంధించిన వీడియోల్లో ఉన్న వారంతా పరారీలో ఉండటంతో… వారి కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. ఇదిలా ఉంటే మస్తాన్ సాయి కుటుంబంపై ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కు లావణ్య అడ్వొకేట్ ఓ కీలక లేఖ రాశారు. మస్తాన్ సాయి కుటుంబం గుంటూరులో మస్తాన్ దర్గా ధర్మకర్తలుగా ఉన్నారని, వారికి ధర్మకర్తలుగా ఉండే అర్హత లేదని, తక్షణమే వారిని తొలగించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. మస్తాన్ సాయిలాంటి వాడి వల్ల దర్గా పవిత్రత చెడిపోతుంది ఆ లేఖలో పేర్కొన్నారు లావణ్య తరపు న్యాయవాది. గవర్నర్ తోపాటు ఏపీ సీఎస్, గుంటూరు కలెక్టర్ కూడా లేఖలు రాశారు లావణ్య న్యాయవాది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి