Taapsee Pannu : పెళ్లికి వేళాయరా.. చేప కళ్ల చిన్నది తాప్సీ మ్యారేజ్ డేట్ ఫిక్స్ .?

|

Mar 03, 2022 | 5:55 PM

తెలుగు తక్కువ సమయంలో ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న భామల్లో అందాల భామ తాప్సీ ఒకరు. దర్శకేంద్రుడు రాఘవేంద్ర  రావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన ఝుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది..

Taapsee Pannu : పెళ్లికి వేళాయరా.. చేప కళ్ల చిన్నది తాప్సీ మ్యారేజ్ డేట్ ఫిక్స్ .?
Taapsee
Follow us on

Taapsee Pannu : తెలుగు తక్కువ సమయంలో ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న భామల్లో అందాల భామ తాప్సీ ఒకరు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన ఝుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ చిన్నది. మొదటి సినిమాతోనే అందం అభినయంతో కుర్రకారును కట్టిపడేసింది ఈ వయ్యారి భామ. ఆతర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేస్తూ దూసుకుపోయింది. తెలుగులో రాణిస్తున్న సమయంలోనే ఈ అమ్మడికి తమిళ్ లోనూ మంచి ఆఫర్స్ వచ్చాయి. తెలుగు తమిళ్ లో బిజీగా హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో ఈ అమ్మడు బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ కూడా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్స్ సరసన చేరిపోయింది ఈ బ్యూటీ. అయితే బాలీవుడ్ లో ఎక్కువ లేడీ ఓరియెంటెడ్ సినిమాలను ప్రాధాన్యత ఇస్తూ రాణిస్తుంది తాప్సీ. ప్రస్తుతం బాలీవుడ్లో బ్యాక్ టు బ్యూక్ ప్రాజెక్ట్స్ను టేకప్ చేస్తూ మస్తు బిజీగా గడుపుతున్న ఈ బ్యూటీ.

ఇదిలా ఉంటే ఈ అమ్మడు త్వరలోనే పెళ్లిపీటలెక్కనుందని వార్తలు ఎప్పటినుంచో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.  బ్యాడ్మింటన్ ఆటగాడు మాథియాస్ బోతో తాప్సీ ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. ఆమె సోదరి షగున్ పన్ను ద్వారా మాథియాస్ బో తాప్సీకి పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. వీరి ప్రేమను పెద్దలు కూడా ఆంగీకరించారు. అయితే తాజాగా మరోసారి ఈ అమ్మడి పెళ్లి టాపిక్ బీ టౌన్ లో చక్కర్లు కొడుతుంది. పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాలని తాప్సీ నిర్ణయించుకున్నారట. దీంతో కుటుంబసభ్యులు వీరి వివాహానికి డేట్ కూడా ఫిక్స్ చేశారని ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇక ఈ చిన్నది లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులో ఓ సినిమా చేసింది.
అదే  `మిషన్ ఇంపాజిబుల్`. స్వరూప్ ఆర్ఎస్జే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Kiran Abbavaram: టికెట్టు కొని సినిమా చూసే నన్ను హీరోను చేశాడు.. యంగ్ హీరో ఎమోషనల్ కామెంట్స్..

Bigg Boss OTT: ప్రేక్షకులకు షాక్.. ఆగిపోయిన బిగ్‏బాస్ నాన్‏స్టాప్.. కారణం చెప్పిన నిర్వాహకులు..

Rana Daggubati: అసలు హీరో అంటే ఏంటో తెలిసింది.. ఈ సినిమాకు ఆయనే వెన్నెముక.. రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్..