గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పద్మ అవార్డులను ప్రకటించింది. ఈసారి దేశవ్యాప్తంగా ఐదుగురికి పద్మ విభూషణ్ అవార్డులు, 17 మందికి పద్మ భూషణ్ అవార్డులు, 110 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి, మాజీ ఉపరాష్టపతి వెంకయ్య నాయుడుకు పద్మవిభూషణ్ అవార్డుల వరించాయి. అయితే మరణాంతరం ఓ స్టార్ హీరో, ప్రముఖ రాజకీయ నాయకుడు పద్మభూషణ్ అవార్డుకు ఎంపికవ్వడం గమనార్హం. ఆయనే కెప్టెన్ విజయ్‌కాంత్. సినిమా, రాజకీయ రంగాల్లో కెప్టెన్ సేవలకు గుర్తింపుగా ఆయనకు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో కెప్టెన్ అభిమానుల్లో చాలామంది సంతోషపడుతున్నారు. అదే సమయంలో విజయ్ కాంత్ మన మధ్యలేకపోవడం విచారమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయ కాంత్‌కు పద్మభూషణ్ అవార్డు రావడంపై స్పందించిన ఆయన సతీమణి ప్రేమలతా విజయకాంత్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారామె. అంతేకాదు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును విజయ్‌కాంత్‌ని ప్రేమించే ప్రతి ఒక్కరికీ, ఆయన అభిమానులకు అంకితం చేస్తున్నట్లు ప్రేమలతా విజయకాంత్ వెల్లడించారు.
స్టార్ హీరోగా, రాజకీయ నాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కెప్టెన్ విజయ కాంత్ గతేడాది డిసెంబర్ 28న తుదిశ్వాస విడిచారు. చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో సతమతమైన ఆయన కరోనా బారిన పడడంతో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ప్రధాని మోడీ, సీఎం జగన్, కేసీఆర్, రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, రవితేజ, నాని తదితర సినీ, రాజకీయ ప్రముఖులు విజయ్ కాంత్‌కు నివాళి అర్పించారు. తమిళనాడు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో విజయ కాంత్ అంత్యక్రియలను నిర్వహించింది.
Thalaiva
Not able to see u cry
Tears in my eyes upon seeing this
Take care of ur health Thalaiva
We love u lots
😔😔#Vijayakanth pic.twitter.com/3zvnj4C2YL— Dr.Ravi (@imravee) December 29, 2023
. @vijayantony paid his last respect for captain #Vijayakanth 😭💔#RIPCaptainVijayakanthpic.twitter.com/Zosx6YBQPg
— MuTHU Movie updates (@Muthupalani_) December 29, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.