Lakshmi Manchu: ‘ఓరేయ్.. నా ముందుకొచ్చి మాట్లాడరా రాస్కెల్?’ మంచు లక్ష్మీ వీడియో వైరల్.. ఏం జరిగిందంటే?

మంచు లక్ష్మీ మళ్లీ సినిమాల్లో బిజీ అవుతోంది. ఆమె నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'దక్ష' సెప్టెంబర్ 19న థియేటర్లలో రిలీజ్ కానుంది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. తండ్రీ కూతుళ్లే ఈ సినిమాను నిర్మించడం విశేషం.

Lakshmi Manchu: ఓరేయ్.. నా ముందుకొచ్చి మాట్లాడరా రాస్కెల్? మంచు లక్ష్మీ వీడియో వైరల్.. ఏం జరిగిందంటే?
Manchu Lakshmi

Updated on: Sep 08, 2025 | 9:04 PM

సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ 2025’ (సైమా 2025) ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. దుబాయ్‌లో నిర్వహించిన ఈ వేడుకలో దక్షిణాది చలన చిత్ర పరిశ్రమల ప్రముఖులు హాజరై సందడి చేశారు. టాలీవుడ్ నుంచి కూడా పలువురు సెలబ్రిటీలు ఈ ఈవెంట్ లో తళుక్కుమన్నారు. పలువురు నటీమణులు తమ డ్యాన్స్ ప్రదర్శనలతో ఆహూతులను ఉర్రూతలూగించారు. ఈ వేడుకలకు టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ కూడా హాజరైంది. రెడ్ డ్రెస్‌లో ఎంతో అందంగా ముస్తాబై రెడ్ కార్పెట్ పై పోజులిచ్చింది. అలాగే ఎంతో ఓపికగా అడిగిన అభిమానులందరికీ ఫొటోలు, సెల్ఫీలు ఇచ్చింది. అయితే ఇదే సమయంలో కొందరు అభిమానులు అతిగా ప్రవర్తించారు. ఆమెను ఆట పట్టిస్తూ ట్రోల్ చేశారు. అసభ్యకరంగా కామెంట్స్ చేశారు. దీంతో అప్పటివరకు ఎంతో ఓపికగా ఉన్న మంచు లక్ష్మీ సహనం కోల్పోయింది. కోపం కట్టలు తెంచుకుంది. ధైర్యం ఉంటే నా ముందుకు వచ్చి మాట్లాడరా? మీకసలు సెన్స్ లేదు రాస్కెల్స్‌.. అంటూ తనను ట్రోల్ చేసిన వారిపై తీవ్రంగా మండి పడింది. అయితే ఇంత జరిగిన తర్వాత కూడా మళ్లీ మామూలుగానే ఫ్యాన్స్ కు సెల్ఫీలు, ఫొటోలు ఇచ్చింది మంచు వారమ్మాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.

కాగా సుమారు ఐదేళ్ల తర్వాత దక్ష సినిమాతో మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించనుంది మంచు లక్ష్మి. అంతేకాదు మోహన్ బాబు ప్రొడక్షన్ బ్యానర్ ల‌క్ష్మి ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్‌ బ్యానర్‌ నుంచి సుమారు పదేళ్ల తర్వాత ఓ సినిమా రిలీజ్ కానుంది. యాక్ష‌న్‌ అండ్‌ క్రైమ్ థ్రిల్ల‌ర్‌లో స‌ముద్ర‌ఖ‌ని, మలయాళ నటుడు సిద్దిక్‌, చైత్ర శుక్ల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మోహ‌న్ బాబు కూడా ఒక ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో క్రైమ్ ఇన్వెస్టిగేష‌న్ ఆఫీసర్‌గా మంచు ల‌క్ష్మీ ప‌వ‌ర్‌పుల్‌ పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే అన్నిహంగులు పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

సైమా-2025 అవార్డ్స్ ఈవెంట్ లో మంచు లక్ష్మీ.. వీడియో ఇదిగో..

సినిమా ఈవెంట్ లో మంచు లక్ష్మీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.