Kriti Kharbanda : అభిమానులకు ఓపెన్ ఆఫర్ ఇచ్చిన హీరోయిన్.. అదేంటో తెలుసా..

| Edited By: Anil kumar poka

Jul 15, 2021 | 9:07 AM

కృతి కర్బందా .. ఈ బాలీవుడ్ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.. 2009లో 'బోణి' అనే తెలుగు సినిమాతో కృతి కర్బందా. ఆ సినిమా తర్వాత పవర్ స్టార్ ..

Kriti Kharbanda : అభిమానులకు ఓపెన్ ఆఫర్ ఇచ్చిన హీరోయిన్.. అదేంటో తెలుసా..
Kriti Kharbanda
Follow us on

కృతి కర్బందా .. ఈ బాలీవుడ్ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.. 2009లో ‘బోణి’ అనే తెలుగు సినిమాతో కృతి కర్బందా. ఆ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి ‘తీన్మార్’ అనే సినిమా చేసింది. ఆతర్వాత రామ్ సరసన ‘ఒంగోలు గిత్త’ సినిమాలో మెరిసింది ఈ చిన్నది. చివరిగా రాంచరణ్ ‘బ్రూస్ లీ’ సినిమాలో అక్కగా కనిపించింది. అయితే ఈ అమ్మడికి తెలుగులో సరైన అవకాశాలు రాలేదు కానీ హిందీలో మాత్రంగా ఆఫర్లు బాగానే అందుకుంటుంది. ప్రస్తుత కృతి అక్కడ బిజీ హీరోయిన్ గా కంటిన్యూ అవుతుంది. ఇటీవలే హిందీలో ‘పాగల్ పంతి’ ‘హౌస్ ఫుల్-4’ సినిమాలతో హిట్స్  అందుకుంది. అక్కడ ఈ కుర్రదానికి వరుస ఆఫర్లు వస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది కృతి. ప్రస్తుతం ‘14 ఫేరే’ మూవీ చేస్తుంది కృతి. అయితే ఈ అమ్మడు అభిమానులకు ఓ అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. అందేంటంటే..

14 ఫేరే మూవీకి సంబంధించిన ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. దేవాన్షుసింగ్ దర్శకత్వంలో జీ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాలో విక్రాంత్ మాస్సే హీరోగా నటిస్తున్నాడు. కృతి హీరోయిన్. తాజాగా తన ఇన్ స్టా అకౌంట్ లో ఒక వీడియోను పోస్టు చేసింది కృతి. తన తాజా మూవీ 14 ఫేరే ట్రైలర్ అందరికి నచ్చి ఉంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసిన ఆమె..  ట్రైలర్ లో తమకు నచ్చిన అంశాలేమిటో తెలియజేయాలని కోరింది. ఎవరైతే తనకు నచ్చిన అంశాల్నే ప్రస్తావిస్తారో.. వారితో జూమ్ కాల్ లో పర్సనల్ గా మాట్లాడుతా అంటూ అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. మరి ఈ ఓపెన్ ఆఫర్ ను ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Rajini Kanth: “అన్నాతే” కంప్లీట్ చేయడానికి కోల్‏కత్తాలో అడుగుపెట్టిన రజినీ.. సూపర్ స్టార్ ఫైనల్ షెడ్యూల్..

Actress Pragathi: పాపం ఎంత కష్టమొచ్చింది.. ట్రెడ్‏మిల్ పై నటి ప్రగతి వర్కవుట్స్ మాములుగా లేవుగా..