ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి కుర్రాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించుకుంది ముద్దుగుమ్మ కృతిశెట్టి(Krithi Shetty ). తొలి సినిమాతోనే అందం అభినయంతో కట్టిపడేసిన ఈ వయ్యారిభామ.. టాలీవుడ్ లో టాప్ గేర్ తో దూసుకుపోతోంది. ఉప్పెన సూపర్ హిట్ తర్వాత నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటించి మెప్పించింది. ఈ సినిమా కూడా మంచి హిట్ అందుకుంది. ఆ వెంటనే నాగార్జున, నాగచైతన్య కాంబోలో వచ్చిన బంగార్రాజు సినిమా కూడా మంచి హిట్ అందుకుంది. ఇలా హ్యాట్రిక్ హిట్స్ కొట్టి లక్కీ బ్యూటీగా మారిపోయింది ఈ చిన్నది. ఆ తర్వాత ఈ అమ్మడు నటించిన సినిమాలు నిరాశపరిచాయి. అయినా కూడా ఈ చిన్నదానికి ఆఫర్లు ఆగడం లేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా మారిపోయింది. తాజాగా ఈ అమ్మడు చేసిన కామెంట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
సినిమాలతోనే కాదు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది కృతి. తన సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది ఈ బ్యూటీ. ఇక తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించింది. అందులో భాగంగా ఓ నెటిజన్ మహేష్ బాబు గురించి అడగగా.. కృతి స్పందిస్తూ..”రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ ఆయన సూపర్ స్టార్’ అంటూ చెప్పుకొచ్చింది. ఈ ఒక్క మాటతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక కృతి సినిమాల విషయానికొస్తే తాజాగా ఈ అమ్మడు నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. అలాగే తమిళ్‌లో స్టార్ హీరో సూర్య నటిస్తున్న సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది కృతి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..