‘కృష్ణ అండ్ హిజ్ లీలా’ మూవీ రివ్యూ..

కరోనా కార‌ణంగా లాక్ డౌన్ ప్ర‌కటించ‌డంతో చాలా సినిమాలు ఓటీటీల బాట ప‌డుతున్నాయి. జనాలు కూడా ఇళ్ల‌లోనే ఉండ‌టంతో ఓటీటీల‌లో సినిమాలు తెగ చూస్తున్నారు.

'కృష్ణ అండ్ హిజ్ లీలా' మూవీ రివ్యూ..

న‌టీన‌టులు : సిద్దు జొన్నలగడ్డ, శ్రద్దాశ్రీనాథ్, షాలిని వద్నికట్టి, వైవా హర్ష

రచన & దర్శకత్వం : రవికాంత్ పేరేపు

నిర్మాత : సురేశ్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 కామ్ మోషన్ పిక్చర్స్, సంజయ్ రెడ్డి

సంగీతం : శ్రీచరణ్ పాకాల

కరోనా కార‌ణంగా లాక్ డౌన్ ప్ర‌కటించ‌డంతో చాలా సినిమాలు ఓటీటీల బాట ప‌డుతున్నాయి. జనాలు కూడా ఇళ్ల‌లోనే ఉండ‌టంతో ఓటీటీల‌లో సినిమాలు తెగ చూస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా.. కృష్ణ అండ్ హిజ్ లీల కూడా ‘ఆహా’ లో అందుబాటులోకి వ‌చ్చింది. దగ్గుబాటి రానా నిర్మించిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం…

కథ :

అప్పుడే గ్రాడ్యువేష‌న్ కంప్లీట్ జాబ్ లో చేరేందుకు సిద్దమయ్యే యువకుడు కృష్ణ (సిద్దు జొన్నలగడ్డ)కు సత్య (శ్రద్దా శ్రీనాథ్)‌తో ప్రేమ విఫ‌ల‌మవుతుంది. బ్రేక‌ప్ మూడ్ లో బాధ‌లో ఉన్న కృష్ణ… రాధా(షాలిని) ప్రేమలో పడతాడు. వారి మ‌ధ్య‌ ప్రేమ స్ట్రాంగ్ అవుతోన్న‌ సమయంలోనే కృష్ణకు జాబ్ రావడంతో బెంగుళూరుకు వెళ్లిపోతాడు. అక్క‌డ కృష్ణకు సత్య మళ్లీ దగ్గరవుతుంది. బెంగళూరులో తన సోదరి ఫ్రెండ్ రుక్సార్ (సీరత్ కపూర్)‌పై ఒకరకమైన ఆకర్షణ పెరుగుతుంది. ఇక్క‌డే త‌న‌ సోదరి ఫ్రెండ్ రుక్సార్ (సీరత్ కపూర్)‌ను కూడా ఇష్టప‌డ‌తాడు కృష్ణ. ఇలా ఒక‌రికి తెలియ‌కుండా ఒక‌రితో రిలేష‌న్ మెయింటైన్ చేస్తాడు. కృష్ణకు సత్య మళ్లీ ద‌గ్గ‌ర‌వ్వ‌డంతో రాధ పరిస్థితి ఏమిటి? సత్యతో రిలేష‌న్ కొనసాగించాడా? లేక రాధతోనే ఉండి సత్యను వదులుకొన్నాడా?. రుక్సార్ తో అత‌డు ఎటువంటి అడుగులు వేశాడు. చివ‌రికి ఎవ‌రితో క‌నెక్ట్ అయ్యాడు అనే అంశాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ప్రేమ..ప్రేయ‌సిల విషయంలో క్లారిటీ లేని కన్ఫ్యూస్డ్ లవర్ గా యువ‌ హీరో సిద్దూ ఆక‌ట్టుకున్నాడు. సినిమా భారం మొత్తాన్ని త‌న‌పై వేసుకుని, అన్ని ర‌కాల ఎమోష‌న్స్ పండిస్తూ అద‌ర‌గొట్టాడు. ఇక రొమాన్స్ విష‌యంతో అతడి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. సత్యగా శ్రద్దా శ్రీనాథ్ మరోసారి పరిణతితో కూడిన నటనతో మంచి మార్కులు కొట్టేశారు. ఇక రాధ పాత్రలో షాలిని‌ ఆకట్టుకొన్నారు. సీరత్ కపూర్ అందాల‌తో క‌నువిందు చేసింది. ఇక కమెడియన్ హర్ష మంచి పాత్రలో మెర‌వ‌గా.. ఝాన్సీ, సంపత్ తమ పరిధిలో అలరించారు. శ్రీచరణ్ పాకాల సాంగ్స్ బాగున్నా యి.

మైనస్ పాయింట్స్ :

ఒకే స‌మయంలో ఒకరికి తెలియకుండా..మరొకరితో ప్రేమ వ్యవహారం నడపడం గ‌తంలో చాలా తెలుగు సినిమాల్లో చూసిన నేప‌థ్య‌మే. అలాగే ట్రై యాంగిల్ లవ్ స్టోరీకి మంచి ముగింపు ఇవ్వ‌డంతో ర‌వికాంత్ ఇంకాస్త ఫోక‌స్ చెయ్యాల్సింది. సెకండాఫ్ లో నేరేష‌న్ చాలా స్లోగా అనిపిస్తోంది. క‌థ‌ను ఇకాంస్త ఎమోష‌న‌ల్ గా మ‌ల‌వ‌డానికి ఆస్కారం ఉన్న‌ప్ప‌టికీ ద‌ర్శ‌కుడు స‌ర్దుకుపోయాడ‌న్న భావం క‌లుగుతుంది.

సాంకేతిక విభాగం :

ఈ సినిమాకి ప్ర‌ధాన ఎస్సెస్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్. ప్ర‌తి ఎమోష‌న్ ని ఎలివేట్ చెయ్య‌డంతో అత‌డి ప‌నితనం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. కెమెరా వర్క్ చాలా బాగుంది. ఎడిటింగ్ పై కాస్త ఫోక‌స్ పెడితే రిజ‌ల్ట్ ఇంకా సాలిడ్ గా ఉండేది. నిర్మాణ విలువ‌లు స్థాయికి త‌గ్గట్టు ఉన్నాయి. ఇక డైరెక్టర్ రవికాంత్ శాయ‌‌శ‌క్తులా ఓ మంచి సినిమా తీయ‌డానికి క‌ష్ట‌ప‌డ్డాడు. డైలాగ్స్ బాగా రాసుకున్నాడు.