గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శంకర్ కాంబోలో రాబోతున్న సినిమా గేమ్ ఛేంజర్. ఇన్నాళ్లు తమిళంలో వరుస హిట్ మూవీస్ తెరకెక్కించిన శంకర్ తొలిసారిగా తెలుగులో దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. దీంతో ఈ ప్రాజెక్ట్ కోసం అడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన పాటలు అటు యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. మరోవైపు టీజర్, ట్రైలర్ మూవీపై హైప్ పెంచేశాయి. ఇందులో తండ్రి కొడుకులుగా చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో రిలీజ్ చేయనున్నారు.
రిలీజ్ డేట్ దగ్గరపడడంతో గేమ్ ఛేంజర్ నుంచి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగా కొండ దేవర పాటను విడుదల చేశారు. “నెత్తురంతా ఉడుకుతున్న ఊరువాడ జాతర” అంటూ సాగే పాట ఆకట్టుకుంటుంది. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. తమన్, శ్రావణ భార్గవి పాడారు. ఈ పాటకు తమన్ మ్యూజిక్ అందించారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో దూసుకుపోతుంది.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో చరణ్ సరసన మరోసారి కియారా అద్వాని నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు. ఇందులో ఎస్ జే సూర్య, అంజలి, శ్రీకాంత్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందని.. అందులో అప్పన్న పాత్రలో చరణ్ కనిపించనున్నాడని అంటున్నారు. దీంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి ఏర్పడింది.
ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..
Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?
Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‌తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.