పాదయాత్రకు సిద్ధమవుతోన్న స్టార్ హీరో.. ఆ తర్వాత సినిమాలకూ లాంగ్‌ బ్రేక్‌!

|

Jul 12, 2023 | 12:19 PM

తమిళనాట నటుడు విజయ్‌కి ఉన్న క్రేజీ అంతా ఇంతా కాదు. తలపతి రాజకీయ ప్రవేశంపై గత కొంత కాలంగా సర్వత్రా చర్చ జరుగుతోంది. దీంతో అటు కోలీవుడ్‌తోపాటు ఇటు తమిళ రాజకీయాల్లోనూ ఈ విషయం హాట్‌ టాపిక్‌గా మారింది. అంతేకాకుండా..

పాదయాత్రకు సిద్ధమవుతోన్న స్టార్ హీరో.. ఆ తర్వాత సినిమాలకూ లాంగ్‌ బ్రేక్‌!
Thalapathy Vijay
Follow us on

తమిళనాట నటుడు విజయ్‌కి ఉన్న క్రేజీ అంతా ఇంతా కాదు. తలపతి రాజకీయ ప్రవేశంపై గత కొంత కాలంగా సర్వత్రా చర్చ జరుగుతోంది. దీంతో అటు కోలీవుడ్‌తోపాటు ఇటు తమిళ రాజకీయాల్లోనూ ఈ విషయం హాట్‌ టాపిక్‌గా మారింది. అంతేకాకుండా విజయ్ అభిమానులు ఏర్పాటు చేసిన ‘విజయ్ మక్కల్ ఇయక్కం (VMI)’ సభ్యులతో జూలై 11న ఆయన సమావేశమయ్యారు. ఈ క్రమంలో విజయ్‌ పాదయాత్రకు సైతం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు అంతటా పాదయాత్ర చేయనున్నాడని కొన్ని జాతీయ వార్తా సంస్థలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. విజయ్‌ కొత్త మువీ ‘లియో’ విడుదలకు ముందే పాదయాత్ర చేయనున్నట్లు, దీనిపై నిన్న జరిగిన సమావేశంలో నిర్ణయం తీసకున్నారని సమాచారం.

ఇక దళపతి విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమాలకు స్వస్తి చెప్పాలనుకుంటున్నాడని, కనీసం మూడేళ్ల వరకు విరామం తీసుకోవచ్చని టాక్‌. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్న విజయ్‌ కొత్త మువీ ‘లియో’ అక్టోబర్ 19న థియేటర్లలో విడుదల కానుంది. లియో తర్వాత వెంకట్ ప్రభుతో ఓ ప్రాజెక్ట్‌ చేసేందుకు విజయ్‌ ఓకే చెప్పాడు. ఇది పూర్తి చేసిన తర్వాత విజయ్‌ పూర్తి సమయం రాజకీయాలపైనే దృష్టి పెట్టే అవకాశం ఉందని వార్తలు జోరందుకున్నాయి. 2024లో రాజకీయ పార్టీని ప్రారంభిస్తాడని, 2026లో జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తాడని ప్రచారం జరుగుతోంది. ఐతే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.