Thalapathy Vijay: దళపతి విజయ్ చేతులు, తలపై గాయాలు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్

వాస్తవానికి దళపతి విజయ్ ప్రస్తుతం 'ద గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)' మూవీ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇటీవలే థియేటర్‌లో విజయ్ నటించిన సినిమా గిల్లీ రీ రిలీజ్ చేశారు. ఈ చిత్రం రీ-రిలీజ్  సందర్భంలో మేకర్స్ దళపతి విజయ్‌ని ఆహ్వానించారు. సినిమాకు వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్‌తో నటుడిని సత్కరించారు. విజయ్ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజల దృష్టి నటుడి చేతులవైపుకి వెళ్లింది. అతని చేతులపై గాయాలు స్పష్టంగా కనిపించాయి.

Thalapathy Vijay: దళపతి విజయ్ చేతులు, తలపై గాయాలు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్
Thalapathy Vijay

Updated on: Apr 25, 2024 | 6:44 PM

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తన సినిమాల ద్వారా అభిమానులను ఎంతగానో అలరించాడు. ఈ స్టార్ హీరో సినిమాల కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు త్వరలో విజయ్ తన సినిమా ప్రయాణానికి గుడ్ బై చెప్పనున్నాడనే టాక్ వినిపిస్తోంది. నటనకు గుడ్ బై  చెప్పేసి తన మొత్తం సమయాన్ని రాజకీయాలకు వెచ్చించనున్నాడు. అయితే ఇంతలో ఆయనకు సంబంధించిన ఓ ఆశ్చర్యకరమైన వార్త వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అవుతోంది.. ఇందులో విజయ్ చేతులు, తలపై గాయాలు కనిపిస్తున్నాయి.

వాస్తవానికి దళపతి విజయ్ ప్రస్తుతం ‘ద గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)’ మూవీ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇటీవలే థియేటర్‌లో విజయ్ నటించిన సినిమా గిల్లీ రీ రిలీజ్ చేశారు. ఈ చిత్రం రీ-రిలీజ్  సందర్భంలో మేకర్స్ దళపతి విజయ్‌ని ఆహ్వానించారు. సినిమాకు వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్‌తో నటుడిని సత్కరించారు.

ఇవి కూడా చదవండి

విజయ్ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజల దృష్టి నటుడి చేతులవైపుకి వెళ్లింది. అతని చేతులపై గాయాలు స్పష్టంగా కనిపించాయి. ఈ గాయాలను చూసిన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ద గోట్ సినిమా షూటింగ్ సమయంలో తలపతి విజయ్ ఈ గాయానికి గురయ్యాడు.

ఒక అభిమాని తన ఎక్స్ ఖాతాలో దళపతి అన్న చేతులు గాయపడ్డాయని రాశాడు. మరో వినియోగదారు  GOAT షూటింగ్ సమయంలో దళపతి విజయ్ చేతి, తలపై చిన్న గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఇది మాత్రమే కాదు దళపతి అభిమానులు ట్విట్టర్‌లో చాలా పోస్ట్‌లు చేశారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..