AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సునీల్ హీరో అంటే ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ నో చెప్పారట..!

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీస్ లో మర్యాద రామన్న సినిమా ఒకటి. సునీల్ హీరోగా తెరకెక్కిన మర్యాద రామన్న సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. మగధీర లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రాజమౌళి ఏ స్టార్ హీరోతో సినిమా చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే సునీల్ తో సినిమా అనౌన్స్ చేసి షాక్ ఇచ్చారు జక్కన్న.

సునీల్ హీరో అంటే ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ నో చెప్పారట..!
Maryada Ramanna
Rajeev Rayala
|

Updated on: Apr 25, 2024 | 5:34 PM

Share

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. అలాగే పాన్  ఇండియా స్థాయిలో సినిమాలు విడుదలై సంచలన విజయాలను అందుకుంటున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీస్ లో మర్యాద రామన్న సినిమా ఒకటి. సునీల్ హీరోగా తెరకెక్కిన మర్యాద రామన్న సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. మగధీర లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రాజమౌళి ఏ స్టార్ హీరోతో సినిమా చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే సునీల్ తో సినిమా అనౌన్స్ చేసి షాక్ ఇచ్చారు జక్కన్న. దాంతో సునీల్ తో ఎలాంటి సినిమా తెరకెక్కిస్తారు అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో వచ్చిన మర్యాద రామన్న సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

ఈ సినిమాలో సునీల్ కు జోడీగా సలోని నటించింది. అయితే ఈ సినిమాలో ముందుగా మరో హీరోయిన్ ను అనుకున్నారట. ఈ సినిమా కథ సిద్ధం అవుతున్న సమయంలో ఈ సినిమాలో సలోని పాత్రలో త్రిషను కానీ అనుష్క ను కానీ హీరోయిన్ గా అనుకున్నారట. అయితే సునీల్ హీరో అనేసరికి ఆ ముద్దుగుమ్మలు కాస్త వెనకడుగు వేశారట. ఈ ఇద్దరూ హీరోయిన్స్ లో ముందుగా త్రిష సినిమా చేస్తానని ఒప్పుకొని ఆతర్వాత నో చెప్పిందట. అనుష్క కూడా సేమ్ అలానే చేసిందట.

సునీల్ హీరోగా చేయడం వల్లే తప్పుకున్నట్లు తెలిపారు. త్రిష, అనుష్క ఆ ఛాన్స్ వదులుకోవడంతో సలోని ఆ అవకాశాన్ని అందుకుంది. మర్యాద రామన్న.. సినిమా కథ విషయానికొస్తే.. ఇంటి గడప దాటేంతవరకు అతిథి ప్రాణాన్ని తీయని ఒక ఊరి పెద్ద ఇంటికి వెళ్ళి హీరో ఇరుక్కోవడం.. అక్కడ నుంచి అతను తప్పించుకోవడానికి పడ్డ కష్టం.. ఈ క్రమంలో హీరోయిన్ హీరోతో ప్రేమలో పడటం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో సునీల్ క్రేజ్ పెరిగింది. ఈ సినిమా తర్వాత హీరోగా వరుసగా సినిమాలు చేశాడు సునీల్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!