Tollywood: భార్యతో మనస్పర్థలు.. సొంతంగా ఇంటిని క్లీన్ చేసుకుంటోన్న స్టార్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?

సాధారణంగా ఆదివారం వచ్చిందంటే అందరూ విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు. ఫ్యామిలీతో కలిసి సినిమాకో లేదా జాలీగా బయటకు ఎక్కడైనా వెళ్లలనుకుంటారు. ఇంకొందరు ఇంట్లోనే సినిమాలు చేస్తూ సండేను సరదాగా గడిపేస్తుంటారు. కానీ ఈ స్టార్ హీరో మాత్రం ఇంటి క్లీనింగ్ పని పెట్టుకున్నాడు.

Tollywood: భార్యతో మనస్పర్థలు.. సొంతంగా ఇంటిని క్లీన్ చేసుకుంటోన్న స్టార్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Actor

Updated on: Apr 28, 2025 | 10:18 AM

సాధారణంగా సినిమా సెలబ్రిటీల ఇళ్లల్లో ఇంటి, వంట పని చేసేందుకు సపరేట్ గా పని మనుషులు ఉంటారు. దాదాపు ఇంట్లో పనులన్నీ వారే చేసుకుంటారు. కానీ ఈ స్టార్ హీరో మాత్రం సింపుల్ గా తన ఇంటిని తనే సొంతంగా క్లీనింగ్ చేసుకున్నాడు. చీపురు తీసుకుని శుభ్రంగా ఒకటికి రెండుసార్లు ఫ్లోర్‌ తుడిచాడు. అంతేకాదు ఇంటిని శుభ్రం చేస్తున్న వీడియోను సోషల్ మీడియా లో షేర్ చేశాడు. దీనికి ఓ క్రేజీ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. . ‘సండే.. సొంతంగా ఇంటిని శుభ్రం చేసుకోవడమే ఈరోజు నా పని. అదేంటోకానీ ఈ పని చేస్తుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తోంది’ అని రాసుకొచ్చాడీ స్టార్ హీరో. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ గా మారింది. దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ‘మీ సింప్లిసిటీకి హ్యాట్సాఫ్ సర్.. మీరు గ్రేట్’‌ అని క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. మరి మీరు కూడా ఈ వీడియోను చూశారా? అయితే ఇందులో ఉన్న ఆ స్టార్ హీరో ఎవరో గుర్తు పట్టారా? అతను మరెవరో కాదు రవి మోహన్ అదేనండి జయం రవి. కొన్నేళ్లుగా జయం రవిగా స్థిరపడిపోయిన ఆయన.. ఇటీవలే తనను రవి అని మాత్రమే పిలవాలని అందరినీ అభ్యర్థించాడు.

కాగా ప్రముఖ ఎడిటర్‌ మోహన్‌ తనయుడే రవి. గాడ్ ఫాదర్ దర్శకుడు మోహన్‌ రాజా ఆయన సోదరుడు. ఇక రవి బావ బావమరిది, పల్నాటి పౌరుషం తదితర చిత్రాల్లో బాల నటుడిగా నటించాడు. ఆ తర్వాత ‘జయం’ (తెలుగు సినిమా జయం రీమేక్‌)తో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. దీంతో తన పేరు ‘జయం రవి’గా మారిపోయింది. దాస్‌, ఇదయ తిరుదన్‌, దీపావళి, పెరణ్మనై, ఎంగేయుమ్‌ కాదల్‌, ఆది భగవాన్‌, రోమియో జూలియట్‌, మిరుథన్‌, బోగన్‌, టిక్‌ టిక్‌ టిక్‌, భూమి, పొన్నియన్‌ సెల్వన్‌, బ్రదర్‌, భూలోహం, కాదలిక్క నేరమిళ్లై, సైరెన్‌’, బ్రదర్‌ తదితర సూపర్ హిట్ సినిమాలతో కోలీవుడ్ లో స్టార్ హీరోల లిస్టులో చేరిపోయాడు జయం రవి. ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడీ స్టార్ హీరో.

ఇవి కూడా చదవండి

రవి మోహన్ లేటెస్ట్ ఫొటోస్..

ఇదిలా ఉంటే రవి మోహన్ ప్రముఖ నిర్మాత సుజాత విజయకుమార్‌ కూతురు ఆర్తిని 2009లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఆరవ్‌, అయాన్‌ అని ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే రవి- ఆర్తి గతేడాది విడిపోయారు. విడాకులకు సైతం దరఖాస్తు చేసుకున్నారు.

వెకేషన్ లో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.