
ఒక భాషలో సినిమాలు హిట్ అయితే మరో భాషలో రీమేక్ కావడం సర్వసాధారణం. స్టార్ హీరోలు లేకపోయినా చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రాలు అనేక భాషలలో రీమేక్ అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ మీకు తెలుసా..హీరోయిన్ త్రిష నటించిన ఒక్క సినిమా దాదాపు తొమ్మిది సార్లు రీమేక్ అయ్యింది. ఇప్పటికీ తెలుగులో ఆ మూవీ ఎవర్ గ్రీన్ సూపర్ హిట్. ఈ సినిమాలోని సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఎక్కడో ఒకచోట ఈ సినిమా పాటలు వినిపిస్తూనే ఉంటాయి. ఇంతకీ ఆ సినిమా ఎంటో తెలుసా.. ? ఆ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహించారు. తెలుగులో నిర్మించిన ఈ చిత్రాన్ని తరువాత తమిళం, కన్నడ, హిందీ, ఒడియా, పంజాబీ, బెంగాలీ వంటి వివిధ భాషలలో రీమేక్ చేశారు. ఆ సినిమా మరేదో కాదు.. నువ్వొస్తానంటే నేనొద్దంటానా..
2005లో విడుదలైన ఈ చిత్రంలో సిద్ధార్థ్ ప్రధాన పాత్ర పోషించారు. ఇందులో త్రిష కథానాయికగా నటించగా.. దివంగత నటుడు శ్రీహారి, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలు పోషించారు. అలాగే ఈ సినిమాలో ప్రభుదేవా అతిథి పాత్రలో కనిపించాడు. ప్రభుదేవా ఈ చిత్రాన్ని 1989లో సల్మాన్ ఖాన్ నటించిన బాలీవుడ్ చిత్రం ‘మైనే ప్యార్ కియా’ నుండి స్పూర్తి తీసుకున్నారు. 2005లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత 2006లో కన్నడలో ‘నీనెల్లో నానల్లె’గా తమిళంలో ఉంకుమ్ ఎంకుమ్‌గా రీమేక్ చేశారు. కన్నడ చిత్రానికి దినేష్ లాల్ దర్శకత్వం వహించగా, తమిళ వెర్షన్‌కు మోహన్ రాజా దర్శకత్వం వహించారు. జయం రవి హీరోగా, త్రిష హీరోయిన్ గా నటించారు. ఈ రెండు చిత్రాలు జూలై 28, 2006న విడుదలై హిట్ అయ్యాయి.
బెంగాలీలో ఐ లవ్ యు టైటిల్ తో రూపొందించారు. మణిపురిలో ‘నింగోల్ దజపా’ అనే టైటిల్ తో తెరకెక్కించారు. ఒడియాలో “సునా చాలీ మో రూపా చాలీ” పేరుతోనూ, పంజాబీలో “తేరా మేరా కి రిష్తా` పేరుతోనూ రీమేక్ చేసి విడుదల చేశారు. ఈ రెండూ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. 2010లో, దీనిని బంగ్లాదేశ్‌లో ‘నిషాష్ అమర్ తుమి’గా, నేపాల్‌లో ‘ది ఫ్లాష్‌బ్యాక్: ఫర్ఖేరా హెర్డా’గా రీమేక్ చేసి విడుదల చేశారు. 2013లో హిందీలో `రామయ్య వస్తావయ్యా` పేరుతో ఈ సినిమా రీమేక్ చేశారు.
Nuvvostanante Nenoddantana
ఇవి కూడా చదవండి :
Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..
Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..
OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..