
పై ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తు పట్టారా? ఇతను ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న ట్యాలెంటెడ్ యాక్టర్స్ లో ఒకడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. స్వయం కృషితో సినిమాల్లో రాణిస్తున్నాడు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. ఇలా అన్ని రకాల పాత్రలు చేస్తున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. అన్నట్లు ఈ నటుడు సినిమాల్లోకి రాక ముందు వేరే ఉద్యోగాలు కూడా చేశాడు. మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేసి మల్టీమీడియా యానిమేటర్‌గా పనిచేశాడు. అయితే సినిమాలపై మక్కువ ఉండడంతో ఇండస్ట్రీలోకి వచ్చాడు. తనదైన నటనతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ఈ హీరో సినిమాలు థియేటర్లలో ఆడకపోయినా ఓటీటీలో దుమ్ములేపుతున్నాయి. దీంతో ఓటీటీ స్టార్ గా మారిపోయాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ఇక ఇప్పుడీ నటుడి పేరు తెగ మార్మోగిపోతోంది. ఎందుకంటే లేటెస్ట్ గా విడుదలైన ఓ సినిమాలో ఈ నటుడు పవర్ ఫుల్ విలన్ పాత్రలో అదరగొట్టాడు. హీరోకు ధీటైన పాత్రలో నటించి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ నటుడు మరెవరో కాదు నవీన్ చంద్ర.
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా మాస్ జాతర. భాను భోగవరపు తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. అయితే వీరిద్దరితో పాటు నవీన్ చంద్ర కూడా ఇందులో ఓ పవర్ ఫుల్ విలన్ పాత్రలో అదరగొట్టడు. శివుడి గా క్రూరమైన విలనిజాన్ని చూపించాడు. దీంతో ఇప్పుడీ నటుడి పేరు తెగ మార్మోగిపోతోంది.
నవీన్ చంద్ర ఎంత బిజీగ ఉన్నాడో అతని సినిమాల లైనప్ ను చూసి అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాద ఇప్పటికే ఆరు సినిమాల్లో నటించాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ముఖ్యంగా ఓటీటీలో ఈ నటుడి సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇతను హీరోగా నటించిన 28 డిగ్రీస్ సెల్సియస్, బ్లైండ్ స్పాట్, లెవెన్, షోటైమ్ వంటి సినిమాలకు ఓటీటీ లో రికార్డు వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం ఈనటుడు పలు సినిమాలతో బిజీగా ఉంటున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.