Cinema : నిజమైన ప్రేమకథ.. కన్నీళ్లు పెట్టించే క్లైమాక్స్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న చిన్న సినిమా..

టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న సినిమాలు సత్తా చాటుతున్నాయి. ఎలాంటి అంచనాలు, హడావిడి లేకుండా విడుదలైన పలు చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే ఇన్నాళ్లు థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఓ ప్రేమకథ.. ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటీ.. ? కథేంటీ ? తెలుసుకుందామా.

Cinema : నిజమైన ప్రేమకథ.. కన్నీళ్లు పెట్టించే క్లైమాక్స్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న చిన్న సినిమా..
Cinema (21)

Updated on: Dec 20, 2025 | 9:39 AM

తెలుగులో ఎలాంటి అంచనాలు, హడావిడి లేకుండా విడుదలైన సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. తక్కువ బడ్జెట్.. కొత్త నటీనటులతో తెరకెక్కించిన చిత్రాలకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల థియేటర్లలో ఓ చిన్న సినిమా పెద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే మూవీ ఓటీటీలో దూసుకుపోతుంది. ఇంతకీ ఆ సినిమా పేరెంటో తెలుసా.. ? అదే రాజు వెడ్స్ రాంబాయి. నిజమైన సంఘటన ఆధారంగా తెరకెక్కించిన ఈ మూవీ అడియన్స్ హృదయాలను గెలుచుకుంది. యంగ్ డైరెక్టర్ సాయిలు కంపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకుల మనసులను తాకింది.

ఇవి కూడా చదవండి : Actress : మూడు సినిమాలతోనే ఇండస్ట్రీనికి షేక్ చేసింది.. బతికి ఉంటే స్టార్ హీరోయిన్ అయ్యేది.. కానీ ప్రియుడి మోసంతో..

నిజమైన సంఘటన ఆధారంగా రూపొందించిన ఈ చిత్రాన్ని సాయిలు కంపాటి ఎంతో సహజంగా భావోద్వేగంగా తెరకెక్కించారు. దర్శకుడిగా మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇందులో కొత్త నటీనటులు అఖిల్ రాజ్, తేజస్విని రావు హీరోహీరోయిన్లుగా నటించారు. ఫస్ట్ మూవీతోనే అద్భుతమైన నటనతో కట్టిపడేశారు. నవంబర్ 21న విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా క్లైమాక్స్ చూసి అడియన్స్ కన్నీళ్లు పెట్టుకున్నారు. అలాగే ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటించిన చైతన్య జొన్నలగడ్డ నటనకు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : బయట చూశాం.. వాళ్ల చరిత్ర మాకు తెలుసు.. తనూజ గురించి శ్రీసత్య, యష్మీ సంచలన కామెంట్స్..

థియేటర్లలో దాదాపు రూ.17 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇన్నా్ళ్లు థియేటర్లలో మెప్పించిన ఈ మూవీకి ఇప్పుడు ఓటీటీలోనూ ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది.

ఇవి కూడా చదవండి : Actress : స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై.. ఇప్పుడు 400 కోట్ల ఇంట్లో ఆ హీరోయిన్..

ఇవి కూడా చదవండి : Cinema: వార్నీ.. ఈ క్రేజీ హీరోయిన్ ఈ విలన్ భార్యానా.. ? తెలుగులో స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ సినిమాలు..