Tollywood : స్టార్ హీరోలతో ఛాన్స్.. వరుసగా 7 సినిమాలు డిజాస్టర్స్.. బ్యూటీకి కలిసిరాని అదృష్టం..

సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఆమె స్టార్ హీరోయిన్. తెలుగు, తమిళం భాషలలో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంది. కానీ ఆ తర్వాత మాత్రం అమ్మడు క్రేజ్ నెమ్మదిగా తగ్గిపోయింది. కొన్నాళ్లుగా ఆమె నటించిన సినిమాలన్నీ డిజాస్టర్స్ అవుతున్నాయి. దీంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు తగ్గిపోయాయి. ఇంతకీ ఆమె ఎవరంటే..

Tollywood : స్టార్ హీరోలతో ఛాన్స్.. వరుసగా 7 సినిమాలు డిజాస్టర్స్.. బ్యూటీకి కలిసిరాని అదృష్టం..
Pooja Hegde

Updated on: May 06, 2025 | 3:05 PM

దక్షిణాదిలో ఆమె అగ్ర కథానాయిక. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే సినీరంగంలోకి అడుగుపెట్టి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతోపాటు తమిళం భాషలలోనూ బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాల్లో నటించింది. అయితే కొన్నాళ్లుగా ఈ బ్యూటీకి సరైన బ్రేక్ రావడం లేదు. వరుసగా స్టార్ హీరోలతో కలిసి నటిస్తున్నప్పటికీ డిజాస్టర్స్ పలకరిస్తున్నాయి. ఇప్పటివరకు ఆమె నటించిన 7 చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో తెలుసుకుందామా.. ? ఆమె మరెవరో కాదు.. పూజా హెగ్డే. 2014లో ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన ముకుంద సైతం ప్లాప్ అయ్యింది. దీంతో మూడేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉంది. ఆ తర్వాత 2017లో అల్లు అర్జున్ సరసన డీజే మూవీలో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా ఆమె కెరీర్ మార్చేసింది.

ఆ తర్వాత తెలుగులో మహేష్ బాబు, ఎన్టీఆర్, బన్నీలతో వరుసగా హిట్స్ అందుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. చివరగా అల వైకుంఠపురంలో సినిమాతో హిట్ అందుకుంది. ఇక తర్వాత ప్రభాస్ జోడిగా రాధేశ్యామ్ సినిమాలో నటించింది. కానీ ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. అలాగే ఆచార్య, బీస్ట్ సినిమాలు సైతం ప్లా్ప్ అయ్యాయి.

దీంతో కొన్నాళ్లుపాటు సినిమాలకు దూరంగా ఉండిపోయింది పూజా. ఆ సమయంలో హిందీలో సల్మాన్ సరసన ఓ ప్రాజెక్ట్ చేసినప్పటికీ ఆ మూవీ సైతం ఫ్లాప్ అయ్యింది. దీంతో కొద్ది రోజులు సైలెంట్ అయిన ఈ అమ్మడు.. ఇప్పుడు సూర్య సరసన రెట్రో మూవీతో అడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమా సైతం అంతగా ఆకట్టుకోలేదు. ఈ సినిమాపై పూజా హెగ్డే చాలా ఆశలు పెట్టుకుంది. అయితే, రెట్రో కూడా విఫలమైంది. మే 1న విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన రాలేదు.

ఇవి కూడా చదవండి :  

Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..

Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..