Tollywood: 15 ఏళ్లకే ఫ్లాట్ ఫామ్ పై జీవితం.. 19 ఏళ్లకే స్టార్ హీరోయిన్.. ఇప్పుడు రాజకీయాల్లో..

సినీరంగంలో నటిగా ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలతో 15 ఏళ్లకే ఇల్లు వదిలిపెట్టింది. తల్లిదండ్రులకు చెప్పుకుండానే ముంబై చేరుకుని.. ఉండేందుకు చోటు లేకపోవడంతో ప్లాట్ ఫామ్ పై జీవించింది. అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి ఇప్పుడు సినీ రంగుల ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకంగా ఓ ఇమేజ్ తెచ్చుకుంది.

Tollywood: 15 ఏళ్లకే ఫ్లాట్ ఫామ్ పై జీవితం.. 19 ఏళ్లకే స్టార్ హీరోయిన్.. ఇప్పుడు రాజకీయాల్లో..
Actress New

Updated on: Dec 08, 2024 | 4:02 PM

పైన ఫోటోలో చీరకట్లులో అందంగా డాన్స్ చేస్తున్న చిన్నారి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. అద్భుతమైన నటనతో అడియన్స్ హృదయాల్లో చోటు సంపాదించుకుంది. ముక్కుసూటిగా మాట్లాడుతూ.. బాలీవుడ్ ఇండస్ట్రీలో నెపోటిజం పై బహిరంగ విమర్శలు చేసింది. ఎన్నో అడ్డంకులు, సవాళ్లు ఎదుర్కొని అగ్ర కథానాయికగా క్రేజ్ సొంతం చేసుకుంది. నటనపై ఆసక్తితో చదువు మధ్యలోనే వదిలేసి 15 ఏళ్లకే ఇంటి నుంచి పారిపోయింది. ముంబై చేరుకుని ప్లాట్ ఫామ్ పై జీవిస్తూ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో బాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ఇన్నాళ్లు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ హీరోయిన్.. ఇప్పుడు పార్లమెంట్ లో అడుగుపెట్టింది. తనే హీరోయిన్ కంగనా రనౌత్.

కంగనా రనౌత్.. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 19 ఏళ్ల వయసులో నటిగా తొలి అవకాశం అందుకుంది. డైరెక్టర్ అనురాజ్ బసు దర్శకత్వం వహించిన గ్యాంగ్ స్టర్ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. ఇందులో ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ఫ్యాషన్ అనే సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో తన అద్భుతమైన నటనకుగానూ ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. ఆ తర్వాత కంగనాకు హిందీలో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన ఛాన్స్ వచ్చింది. క్వీన్, మణికర్ణిక, తను వెడ్స్ మను వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో మెప్పించింది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన ఏక్ నిరంజన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు. ఇవే కాకుండా కంగనా నటించిన తను వెడ్స్ మను సినిమా రూ.100 కోట్లు రాబట్టి తొలి హీరోయిన్ సెంట్రిక్ సినిమాగా రికార్డ్ సృష్టించింది. కథానాయికగా, దర్శకురాలిగా, నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న కంగనా.. ఇటీవలే బీజేపీ పార్టీ నుంచి హిమాచల్ ప్రదేశ్ లోని మండి నుంచి ఎంపిగా పోటి చేసి గెలిచింది.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.