
సినిమాల్లోకి రాకముందు విభిన్నరంగాల్లో పనిచేసిన నటీనటులు చాలా మంది ఉన్నారు. కొందరు ఉన్నత ఉద్యోగాలను వదిలి సినీరంగంలోకి అడుగుపెట్టారు. మరికొందరు మాత్రం నటనపై ఆసక్తితో అనేక కష్టాలను ఎదుర్కొని ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేశారు. విమర్శకలు, తిరస్కరణలకు గురై.. ఆ తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని తమకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటుడు సైతం ఇండస్ట్రీలోకి రాకముందు ఎంతో కష్టపడ్డారు. ఒకప్పుడు ఆకలి బాధలు తప్పించుకోవడానికి సిమ్ కార్డులు అమ్మిన వ్యక్తి.. ఇప్పుడు కోట్లాది రూపాయలకు యజమానిగా మారాడు. ఇంతకీ అతడు ఎవరు అని ఆలోచిస్తున్నారా.. ? అతడు మరెవరో కాదండి.. బాలీవుడ్ హీరో విజయ్ వర్మ.
ఇవి కూడా చదవండి : Prithviraj Sukumaran : ఏంటీ.. ఈ స్టార్ హీరో భార్య టాప్ జర్నలిస్టా.. ? ఫోన్ కాల్తో ప్రేమకథ.. లవ్ స్టోరీలో సినిమాను మించిన ట్విస్టులు..
హైదరాబాద్ కు చెందిన విజయ్ వర్మ.. నటనపై ఆసక్తితో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. హిందీలో అనేక చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ ప్రారంభంలో ప్రేమకు దూరంగా ఉన్న విజయ్.. కొన్నాళ్ల క్రితం మిల్కీ బ్యూటీ తమన్నాతో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరు కలిసి లస్ట్ స్టోరీస్ 2 లో నటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. కొన్నాళ్లపాటు డేటింగ్ చేసిన వీరు ఇప్పుడు విడిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే ఇందుకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు.
ఇవి కూడా చదవండి : Nani : నానితో జెర్సీ సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా.. ? చివరకు ఆ హీరోతో బ్లాక్ బస్టర్..
తమన్నాతో విడిపోయిన తర్వాత విజయ్ వర్మ.. బాలీవుడ్ హీరోయిన్, దంగల్ మూవీ ఫేమ్ ఫాతిమా సనా షేక్ తో ప్రేమలో ఉన్నారనే ప్రచారం నడుస్తుంది. విజయ్ వర్మ.. హిందీలో వరుస సినిమాల్లో నటిస్తున్నారు. గతేడాది ఐసీ 814 : ది కందహార్ హైజాక్ సిరీస్ తో గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల్లోకి రాకముందు విజయ్ వర్మ.. సిమ్ కార్డులు అమ్మడం.. కాల్ సెంటర్ లో పనిచేయడం వంటి చిన్న చిన్న పనులు చేశారు. ఆ తర్వాత ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్ స్టిట్యూట్ లో శిక్షణ తీసుకుని ముంబైకి మకాం మార్చాడు. ఆ తర్వాత సినిమాల్లో అవకాశం అందుకుని నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
Tamanna, Vijay Varma
ఇవి కూడా చదవండి : Prithviraj Sukumaran : ఏంటీ.. ఈ స్టార్ హీరో భార్య టాప్ జర్నలిస్టా.. ? ఫోన్ కాల్తో ప్రేమకథ.. లవ్ స్టోరీలో సినిమాను మించిన ట్విస్టులు..