భారతీయ సినీ పరిశ్రమలో ప్రకాష్ రాజ్ స్థానం ప్రత్యేకం. హీరోగా.. విలన్‍గా, తండ్రిగా.. ఇలా ప్రతి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తాడు ప్రకాష్ రాజ్. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకాష్ రాజ్ రెండవ పెళ్లి గురించి తెగ వైరల్ అవుతుంది. అదెంటో తెలుసుకుందామా. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్.. తన రెండవ భార్య పోనీ వర్మను మళ్లీ పెళ్లి చేసుకున్నట్లుగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన 11వ వివాహా వార్షికోత్సవం సందర్భంగా తమ కుమారుడి కోరిక మేరకు తన భార్యను మళ్లీ పెళ్లి చేసుకున్నట్లుగా తెలిపాడు. ఈ రాత్రి మేము మళ్లీ పెళ్లి చేసుకున్నాం. ఎందుకంటే మా కొడుకు వేదాంత్ మా పెళ్లిని చూడాలనుకున్నాడు అంటూ ట్వీట్ చేశాడు ప్రకాష్ రాజ్.
ఇంతకీ ప్రకాష్ రాజ్ రెండవ భార్య పోనీ వర్మ గురించి తెలుసా..
పోనీ వర్మ. ఈమె చిత్రపరిశ్రమలో ఫేమస్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్. దాదాపు 21 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నారు. 2000లో కెరీర్ ప్రారంభించిన పోనీ వర్మ కలర్స్ ఛానెల్లో వచ్చే చక్ ధూమ్ ధూమ్ వంటి రియాలిటీ షోలలో పాల్గొంది. ఈమె 24 ఆగస్ట్ 2010న నటుడు ప్రకాష్ రాజ్‌ను వివాహం చేసుకుంది. అయితే ప్రకాష్ రాజ్‌కు ఇది సెకండ్ మ్యారెజ్. 1994లో నటి లలిత కుమారిని వివాహం చేసుకున్నాడు ప్రకాష్ రాజ్. వీరికి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. అయితే 2009లో ఈ జంట విడాకులు తీసుకున్నారు.
ఆ తర్వాత ప్రకాష్ రాజ్ 2010లో కొరియోగ్రాఫర్ పోనీ వర్మను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు ఫిబ్రవరి 2016లో వేదాంత్ జన్మించాడు. పోనీ వర్మ అనేక సినిమాలను కొరియోగ్రాఫర్‌గా పనిచేసింది. టైగర్ జిందా హై, జంజీర్, జిలా ఘజియాబాద్, డర్టీ పిక్చర్, బద్రీనాథ్, గుజారిష్, అలా మొదలైంది, యే తేరా ఘర యే మేరా ఘర్, ఎ బర్డ్ ఇన్ డేంజర్, ఫిల్హాల్, ముస్కాన్ వంటి చిత్రాలను కొరియోగ్రఫి చేసింది.
Also Read: అడుగడునా అడ్డంకులే.. అన్నింటికి మించి సోదరున్ని కోల్పోయాం.. షాకింగ్ విషయాలను బయటపెట్టిన మేకర్స్..
Aarya: చీటింగ్ కేసు నుంచి హీరో ఆర్యకు ఉపశమనం.. అసలు దొంగలను పట్టుకున్న పోలీసులు..