టాలీవుడ్ హీరో నారా రోహిత్ తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నాడు. తన బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెబుతూ త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నాడీ ట్యాలెంటెడ్ హీరో. ప్రతినిధి-2 సినిమాలో తన తో స్క్రీన్ షేర్ చేసుకున్న హీరోయిన్ సిరి లేళ్లతో కలిసి జీవితం పంచుకోనున్నాడు నారా రోహిత్. వీరి నిశ్చితార్థం ఆదివారం (అక్టోబర్ 14) అట్టహాసంగా జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ ఫ్యామిలీస్ తో పాటు పలువురు రాజకీయ నాయకులు, సినీ స్టార్స్ ఈ వేడుకకు హాజరయ్యారు. కాబోయే దంపతులకు ముందస్తుగా అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం నారా రోహిత్- సిరి లేళ్ల ఎంగేజ్ మెంట్ ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు ఈ కాబోయే జంటకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే నారా రోహిత్ కు కాబోయే భార్య సిరి లేళ్ల గురించి తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె గురించి పలు ఆసక్తకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
సిరి లేళ్ల మన తెలుగమ్మాయే. ఏపీలోని రెంట చింతల ఆమె స్వగ్రామం. బ్యాచిలర్ డిగ్రీ వరకు ఇక్కడే చదువుకున్న సిరి ఆ తర్వాత ఆస్ట్రేలియాకు వెళ్లి మాస్టర్స్ కూడా పూర్తి చేసింది. అయితే సినిమా ఇండస్ట్రీపై మక్కువతో తిరిగి ఇండియాకు వచ్చేసింది. హైదరాబాద్ లో తన అక్క దగ్గర ఉంటూ ఆడిషన్స్ కు హాజరైంది. ఇదే క్రమంలో ప్రతినిధి-2 మూవీ ఆడిషన్స్ కు హాజరై హీరోయిన్ గా ఎంపికైంది. ఈ సంగతి పక్కన పెడితే నారా రోహిత్, సిరి ఏజ్ గ్యాప్ గురించి కూడా నెట్టింట చర్చ జరుగుతోంది. ప్రస్తుతం రోహిత్ వయసు సుమారు 39 ఏళ్లు కాగా, సిరి వయసు 28 సంవత్సరాలు. అంటే వీరిద్దరి మధ్య 11 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్నట్లు తెలుస్తోంది.
Together, we’ve shared countless laughter-filled moments, adventures, and memories. And now, I am excited to begin the greatest journey of my life- building a life filled with love and joy forever Siri ❤️ pic.twitter.com/bAoZPLJASx
— Rohith Nara (@IamRohithNara) October 13, 2024
Celebrating my nephew @IamRohithNara and Sirisha’s engagement ceremony today. Bhuvaneshwari and I warmly welcome Sirisha into our family, and we extend our heartfelt blessings to both of them. Wishing them a lifetime filled with happiness as they embark on this journey together. pic.twitter.com/kWxsMqrtYx
— N Chandrababu Naidu (@ncbn) October 13, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.